
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడం వెనుక కారణాలు, లోపాలు తేల్చేందుకు ఎన్.డి.ఎస్.ఏ నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. ఆరుగురు సభ్యుల బృందం మొదటిరోజు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిశీలించారు. వారితో పాటు పాల్గొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారుల నుండి సమాచారం సేకరించారు. మొదటిరోజు నిపుణుల కమిటీ ఎలాంటి సమాచారం సేకరించారు.? ఏం తేల్చారు.? నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ నియమించిన ఆరుగురు సభ్యుల బృందం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తున్నారు. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తున్నారు. గురువారం ఉదయం 9.30 నిమిషాలకు మెడగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్న NDSA నిపుణుల కమిటీ మొదట బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని పరిపాలించారు. దాదాపు మూడు గంటల పాటు బ్యారేజ్ పైన పరిశీలించారు. అనంతరం కాపర్ డ్యామ్ ద్వారా కిందకు వెళ్లారు. 7వ బ్లాక్‌లో 18,19,20,21 పిల్లర్లను పరిశీలించారు. పగుళ్లుతేలిన పిల్లర్లు, క్వాలిటీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం బ్యారేజ్ లోని 8 బ్లాక్‌లను దశల వారిగా పరిశీలించి పూర్తిగా వీడియో & ఫోటో గ్రాఫి నిర్వహిస్తున్నారు.
ఒక రోజంతా మేడిగడ్డ బ్యారేజ్ వద్దే వివరాలు సేకరించిన నిపుణుల కమిటీ బ్యారేజ్ అప్ స్ట్రీమ్ – డౌన్ స్ట్రీమ్ వైపు విచారణ జరిపారు. 20వ పిల్లర్ కుంగుబాటుపై లోతుగా అధ్యయనం జరిపారు. మధ్యాహ్నం తర్వాత అన్నారం బ్యారేజ్ సందర్శన ఉండగా పర్యటనలో స్వల్ప మార్పులు చేసుకున్న నిపుణుల కమిటీ మేదిగడ్డ బ్యారేజ్ డ్యామ్ సేఫ్టీపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. 7వ బ్లాక్ సింకింగ్ పై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ప్రాజెక్ట్ సందర్షణకంటే ముందు NDSA కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖను 19 రకాల వివరాలు కోరింది. వాటిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ DPR తో పాటు, బ్యారేజ్ ఔట్ ప్లానింగ్, టోఫోగ్రఫిక్ సర్వే రిపోర్ట్, పునాదులకు సంబందించిన జియలజికల్ రిపోర్ట్, జియో టెక్నికల్ రిపోర్ట్స్, బ్యారేజ్ నిర్మాణానికి ముందు సాయిల్ టెస్ట్, ఇంజనీరింగ్ ఎక్స్ పర్ట్స్ నివేదికలు, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్, మోడల్ స్టడీస్ నివేదికలు, డిఫెక్ట్స్ లయబిలిటీ పీరియడ్ కు సంబంధించిన కాంట్రాక్ట్ ఒప్పంద క్లాజులు తదితర అంశాలపై రిపోర్ట్స్ కోరారు.
NDSA కోరిన పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కమిటీ కోరిన వివరాలు అందించిన ఇంజనీరింగ్ నీటి పారుదలశాఖ ఇంజనీరింగ్ అధికారుల బృందం NDSA నిపుణుల కమిటీతో కలిసి విచారణలో పాల్గొన్నారు. డ్యామ్ సేఫ్టీ, లోపాల పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్న కమిటీ.. బ్యారేజ్‌లో 16.17 tmc నీటి స్టోరేజ్ సామర్ధ్యం ఉందా.. అనే వివరాలపై ఆరా తీశారు. NDSA నిపుణుల కమిటీ విచారణ సందర్బంగా మేడిగడ్డ బ్యారేజ్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు మెడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, డ్యామ్ సేఫ్టీ పై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తరువాత రాత్రి రామగుండం లోని NTPC గెస్ట్ హౌజ్ లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌లను పరిశీలిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఒక అంచనాకు వచ్చిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. నిపుణుల కమిటీ విచారణ సందర్బంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్యారేజ్ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. ఈ కమిటీ చివరకు ఏం తెల్చుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.