Turmeric Board: పసుపు రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నెల 22 నుంచి దరఖాస్తులు

National Turmeric Board: పసుపు నాణ్యత సాధించడానికి, తమ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, పంటకు మెరుగైన మద్దతు ధరను పొందడానికి అర్హులైన రైతులు, సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు పిలుపునిచ్చింది. పూర్తి చేసిన దరఖాస్తులను, దానికి జోడించాల్సిన అన్ని నిర్దేశిత..

Turmeric Board: పసుపు రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నెల 22 నుంచి దరఖాస్తులు
National Turmeric Board

Updated on: Jul 14, 2026 | 6:39 PM

National Turmeric Board: భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ పసుపు బోర్డు, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తన అభివృద్ధి కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. పసుపు పంట కోత అనంతరం అవసరమైన వివిధ రకాల యంత్రాలను కొనుగోలు చేయడానికి, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం (సబ్సిడీ) కోరుతూ అర్హులైన రైతులు, భాగస్వాముల నుండి బోర్డు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ వ్యూహాత్మక చొరవ ప్రత్యేకంగా పసుపు పండించే రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), రైతు సంఘాలు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఎంతో మేలు చేకూర్చనుంది. కోత అనంతర యాంత్రీకరణకు ఆర్థిక రాయితి కల్పించడం ద్వారా, మార్కెట్‌లో పసుపు నాణ్యతను పెంచడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ పసుపు ఉత్పాదకతను, పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.

దరఖాస్తులు ఎప్పటి నుంచి..

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: జూలై 22, 2026 (ఉదయం 9.00 గంటలకు)
  • దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: జూలై 31, 2026 (సాయంత్రం 5.30 గంటల వరకు)

దరఖాస్తు చేసుకునే విధానం:

పూర్తి చేసిన దరఖాస్తులను, దానికి జోడించాల్సిన అన్ని నిర్దేశిత పత్రాలతో పాటు, నిర్ణీత గడువు ముగిసేలోపు నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద దరఖాస్తులను ముందుగా వచ్చిన వారికి ముందుగా ప్రాధాన్యత ప్రాతిపదికన మాత్రమే పరిగణించనున్నారు. అందువల్ల అర్హులైన ఆసక్తి గల రైతులు, సంస్థలు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అధికారులు.

ఇవి కూడా చదవండి

పసుపు రంగు బంగారంతో సమానమైన నాణ్యత సాధించడానికి, తమ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, పంటకు మెరుగైన మద్దతు ధరను పొందడానికి అర్హులైన రైతులు, సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు పిలుపునిచ్చింది.

మరింత సమాచారం, సంప్రదింపుల కోసం:

దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు లేదా ఇతర మార్గదర్శకాలపై ఏవైనా సందేహాలుంటే నిజామాబాద్‌లోని ఆర్యనగర్‌లో ఉన్న ప్రధాన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చు. అలాగే ఏవైనా సందేహాల కోసం ఫోన్‌ నంబర్‌ : 08462 – 293350లో కూడా సంప్రదించవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి

Follow Us