తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రానికి పక్కా ప్లానింగ్‌తో సిద్ధమవుతోంది కమలదళం.! రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కోర్ కమిటీ మీటింగ్‌లో పలు కీలక అంశాలపై చర్చించారు. జాతీయ నేతలు శివప్రకాష్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్.. నేతలకు దిశానిర్దేశం చేశారు. జన సంపర్క్ పేరుతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. మే 15 నుంచి జూన్ 15 వరకు కేంద్ర ప్రభుత్వ విజయాలు, BRS అవినీతిని ప్రజలకు వివరించనున్నారు. అలాగే బూత్ స్వశక్తీకరణ్ వేంగాన్ని కూడా పెంచాలని ఆదేశించారు. ఈనెల 23న అమిత్‌షా పాల్గొనే చేవెళ్ల సభపైనా కోర్‌కమిటీ మీటింగ్‌లో చర్చించారు. భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారు. బాన్సువాడకు చెందిన పలువురు నేతల తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు..
ఆపరేషన్ ఆకర్ష్‌పైనా గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. పార్టీలో చేరే అవకాశం ఉన్న నేతల లిస్ట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది.. జిల్లాల వారీగా నేతల జాబితాను కూడా రెడీ చేసినట్లు సమాచారం. పార్టీలో సంస్థాగత మార్పులకు కూడా సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించింది హైకమాండ్.. రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ కమిటీల్లో వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పింది. పదవుల్లో ఉండి పార్టీకి దూరంగా ఉన్న వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం