National Integration Day: రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

|

Sep 16, 2022 | 8:29 PM

సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెల‌వు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాల‌యాలు, విద్యా సంస్థలకు శ‌నివారం సెల‌వు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

National Integration Day: రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
Ts Cm Kcr
Follow us on

National Integration Day: తెలంగాణలోని సీఎం కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెల‌వు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాల‌యాలు, విద్యా సంస్థలకు శ‌నివారం సెల‌వు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ జాతీయ స‌మైక్యతా దినోత్సవం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ శనివారం ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు. అనంత‌రం బంజారాహిల్స్‌లో ఆదివాసీ, బంజారా భ‌వ‌నాల‌ను ప్రారంభిస్తారు. మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

కాగా.. రేపు తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరిట కేంద్రం వేడుకలు నిర్వహిస్తుండగా.. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల వేడుకలను నిర్వహిస్తోంది. కాగా.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం పేరిట కాంగ్రెస్‌ వేడుకలను నిర్వహిస్తోంది. కాగా.. పరేడ్ గ్రౌండ్ లో జరిగే విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం