Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు సమాచారమిచ్చాం.. ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విముక్తి దివస్ పేరుతో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణలో వేడుకలు జరుగుతాయని వివరించారు.
Hyderabad Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా రేపు CISF, CRPF, RAF జవాన్లు కవాతు నిర్వహిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల స్థూపం దగ్గర కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాళులర్పిస్తారని తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విముక్తి దివస్ పేరుతో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణలో వేడుకలు జరుగుతాయని వివరించారు. విమోచన దినోత్సవ వేడుకల కోసం 25 సంవత్సరాలు బీజేపీ పోరాడిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కానీ అప్పటి ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణ విమోచన వేడుకలు జరుపుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ సాయుధపోరాటంలో అమరులైన వీరుల జ్ఞాపకార్ధం అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్రామాల్లో ఉన్న బురుజులపైనా జెండా ఎగరేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లకు లేఖలు రాశామని తెలిపారు. రేపుసాయంత్రం పరేడ్‌గ్రౌండ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, కర్నాటక సీఎంలు వస్తారని సమాచారం అందిందన్నారు. సీఎం కేసీఆర్ రావాలని పిలుపునిచ్చామన్నారు. కానీ, కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, MLAలకు కూడా సమాచారమిచ్చామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..