Independence day 2022: నిమిషం పాటు నిలిచిపోయిన హైదరాబాద్‌ మెట్రో.. ప్రభుత్వ పిలుపు మేరకు

హైదరాబాద్‌ మెట్రో రైలు సైతం ఒక్క నిమిషం పాటు ఆగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు ఉదయం 11.30 గంటలకు మెట్రో రైళ్లు, స్టేషన్లలో..

Independence day 2022: నిమిషం పాటు నిలిచిపోయిన హైదరాబాద్‌ మెట్రో.. ప్రభుత్వ పిలుపు మేరకు
Janaga

Edited By:

Updated on: Aug 16, 2022 | 2:07 PM

Independence day 2022: ఆగస్టు 16 ఉదయం 11.30 నిమిషాలకు తెలంగాణ అంతటా మన జాతీయ గీతం జనగణమనతో మార్మోగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ గీతాలాపన చేయాలంటూ ఇచ్చిన పిలుపు మేరకు..మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపన చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సాధారణ ప్రజలు సైతం ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ మెట్రో రైలు సైతం ఒక్క నిమిషం పాటు ఆగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు ఉదయం 11.30 గంటలకు మెట్రో రైళ్లు, స్టేషన్లలో జాతీయ గీతాలాపన చేశారు. ఆ సందర్భంగా మెట్రో రైళ్లు ఒక్క నిమిషం పాటు నిలిచిపోయాయి. ప్రయాణీకులందరూ తమ స్థానాల్లో నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఏ వీడియో చూసిన తెలంగాణలో జరిగిన జాతీయ గీతాలాపాన దృశ్యాలే హల్‌చల్‌ చేస్తున్నాయి. అటు సిద్ధిపేట మున్సిపల్‌ పరిధిలో కల్లు గీత కార్మికులు వినూత్నంగా ఒకే తాటిచెట్టుపై 20 మంది గౌడన్నలు జాతీయ జెండాను చేతబట్టి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి