Drugs Case: డ్రగ్స్‌ కొనుగోళ్లకు కేటుగాళ్ల సీక్రెట్‌ కోడ్‌.. మత్తు దందాలో వెలుగులోకి కొత్త కోణాలు.

|

Apr 01, 2022 | 12:42 PM

చేతులూ కాళ్లు, చెస్ట్‌పై టాటూస్‌ ఉన్నాయా? అయితే వాళ్లు డ్రగ్ బానిసలు కావొచ్చు.! పర్టికులర్‌గా ఆ టాటూస్‌ ఉన్నాయా? అయితే, వాళ్లు కన్ఫ్మామ్‌గా డ్రగ్ అడిక్ట్సే. అందులో డౌటే లేదు. ఎందుకంటే..

Drugs Case: డ్రగ్స్‌ కొనుగోళ్లకు కేటుగాళ్ల సీక్రెట్‌ కోడ్‌.. మత్తు దందాలో వెలుగులోకి కొత్త కోణాలు.
Drug Supply
Follow us on

చేతులూ కాళ్లు, చెస్ట్‌పై టాటూస్‌(Tattoos) ఉన్నాయా? అయితే వాళ్లు డ్రగ్ బానిసలు కావొచ్చు.! పర్టికులర్‌గా ఆ టాటూస్‌ ఉన్నాయా? అయితే, వాళ్లు కన్ఫ్మామ్‌గా డ్రగ్ అడిక్ట్సే. అందులో డౌటే లేదు. ఎందుకంటే, డ్రగ్స్‌ సప్లైయర్స్‌ అండ్ కన్జూమర్స్‌కి మధ్య ఇదే సీక్రెట్‌ కోడ్‌ లాంగ్వేజ్. డ్రగ్‌ పెడ్లర్స్‌ ఎవరికి బడితే వాళ్లకు డ్రగ్స్‌ సప్లై చేయరు.. అమ్మరు. ఒంటిపై ఆ టాటూస్‌ ఉంటేనే డైరెక్ట్‌గా డ్రగ్స్‌ సప్లై, లేదంటే లేదు. అలాంటి, డ్రగ్ ఇండికేషన్ టాటూలు వందల్లో ఉన్నాయి. వాటిల్లో 20 టాటూలను ఐడెంటిపై చేశారు హైదరాబాద్‌ పోలీసులు. డ్రగ్‌ అడిక్ట్ డెత్‌ కేసులో తీగ లాగేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవాలో టాటూస్‌ సెంటర్‌ కేంద్రంగానే డ్రగ్స్‌ దందా సాగినట్లు గుర్తించారు పోలీసులు. డ్రగ్స్‌ కోసం గోవా వెళ్తోన్నవాళ్లలో బీటెక్‌ స్టూడెంట్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.

ఇక, డ్రగ్స్‌ సూత్రధారి లక్ష్మీపతి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. లక్ష్మీపతిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. అదే సమయంలో డ్రగ్స్‌ బానిసలను గుర్తించే పనిలో పడ్డారు.

గోవా లో జరిగే పార్టీలకు వెళ్లి డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు విద్యార్ధులు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఉన్నట్లుగా తాజా అధ్యాయనంలో తేలింది. ఈ కేసులో ఒక ప్రైవేటు ఉద్యోగితో పాటు గిటార్ ప్లేయర్ ఉన్నాడని పోలీసులు నిర్దారించుకున్నారు. ఆయీష్ ఆయిల్ ను ఎగుమతి చేసి సప్లయ్ చేస్తుంటాడు డ్రగ్స్ పెడ్లర్ లక్ష్మీపతి.

ఈ డ్రగ్స్‌ను కేవలం హైదరాబాద్‌కు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్టానికి అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. మరిన్ని వివరాలను సేకరించే పనిలో పడ్డారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించి వారి వివరాలు సేకరిస్తున్నారు .

ఇదిలావుంటే.. గోవా కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యాపారం నడుస్తున్నట్లుగా తేలింది. ఇక్కడి నుంచే తెలంగాణలోనివారు కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించారు. డ్రగ్స్ పెడ్లర్ల టార్గెట్ కూడా విచిత్రంగా ఉంటుంది. వీరు ముందుగా విద్యాసంస్థల్లోని సంపన్నుల పిల్లల గుర్తించి.. వారిని వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఖరీదైన డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్‌ పర్యటనలో ఆంతర్యం అదే..

Skin Care Tips: వేసవిలో మొటిమలు, జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రీ గంధంతో ఇలా చెక్ పెట్టండి..