శ్రీనివాస్ గౌడ్ ‘ఆఫిడవిట్ కేసు’లో పోలీసులపై కోర్టు ఆగ్రహం.. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలంటే లెక్క లేదా అంటూ..

|

Aug 11, 2023 | 5:32 PM

Telangana: కోర్టు ఆదేశాలను ఇచ్చి 10 రోజులు దాటినా మహబూబ్‌నగర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ చేయకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు పిటిషనర్‌ రాఘవేంద్ర రాజు. దీంతో కోర్టు మరోసారి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ కేసులో జోక్యం చేసుకుంది. ఈ మేరకు కోర్టు ఇచ్చిన ఆదేశాలంటే లెక్క లేదా అంటూ మహబూబ్‌నగర్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 4 గంటల్లోగా కేసు నమోదు చేయాలని పోలీసులను..

శ్రీనివాస్ గౌడ్ ‘ఆఫిడవిట్ కేసు’లో పోలీసులపై కోర్టు ఆగ్రహం.. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలంటే లెక్క లేదా అంటూ..
Minister Srinivas Goud
Follow us on

తెలంగాణ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ను ఎన్నికల అఫిడవిట్‌ కేసు వెంటాడుతోంది. అఫిడవిట్‌ను ట్యాంపర్‌ చేశారన్న ఆరోపణలతో పది రోజుల క్రితం సంచలన ఆదేశాను ఇచ్చింది నాంపల్లి కోర్టు. తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు తదితర శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్న విరసనోళ్ల  శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు మరో 10 మందిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది కోర్టు. కోర్టు ఆదేశాలను ఇచ్చి 10 రోజులు దాటినా మహబూబ్‌నగర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ చేయకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు పిటిషనర్‌ రాఘవేంద్ర రాజు. దీంతో కోర్టు మరోసారి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ కేసులో జోక్యం చేసుకుంది. ఈ మేరకు కోర్టు ఇచ్చిన ఆదేశాలంటే లెక్క లేదా అంటూ మహబూబ్‌నగర్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 4 గంటల్లోగా కేసు నమోదు చేయాలని పోలీసులను మరోసారి ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాక.. నివేదిక ఇవ్వాలని కోరింది నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు.

మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ను ట్యాంపర్‌ చేశారంటూ కోర్టును ఆశ్రయించాడు మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు. ఈ మేరకు మంత్రితో పాటు బాధ్యులైన రిటర్నింగ్‌ అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరారు. అయితే రాఘవేంద్ర రాజు పిటిషన్‌ను కొట్టేయాలంటూ హైకోర్టుకు వెళ్లారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. కానీ ఆయనకు హైకోర్టులో చుక్కెదురైంది. రాఘవేంద్ర రాజు పిటీషన్‌పై శ్రీనివాస్‌ గౌడ్‌ అభ్యంతరాలను హైకోర్టు తోసి పుచ్చింది. అదే సమయంలో నాంపల్లి కోర్టు ఏకంగా క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చి సంచలనం సృష్టించింది. ఈ ఆదేశాలు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. మహబూబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో మరోసారి ఆదేశాలిచ్చింది న్యాయస్థానం.

కాగా, 2018 ఎన్నికల సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌ స్థానంలో మరో అఫిడవిట్ అప్లోడ్ చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంలో రాఘవేంద్ర రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో నాంపల్లి కోర్టుతో పాటు ఎన్నికల సంఘం కూడా విచారణ జరుపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..