Telangana Rythu Bandhu: రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక రైతు బంధు విషయంలో అనేక అపోహలు తలెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అందరికీ రైతుబంధు పథకం అందుతుందని, ఎవ్వరి కూడా అపోహలు, అవసరం లేదని స్పష్టం చేశారు. జనవరి 1వ తేదీ నుంచి వరుసగా సెలవు దినాలు వచ్చాయని, నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో రైతుబంధు స్కీమ్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడంలో కాస్త ఆలస్యమైందని అన్నారు. తర్వాత అందరికి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేయడం జరుగుతుందన్నారు.
కొందరు రైతు బంధు పథకంలో లేనిపోని అపోహాలు, అనుమానాలను సృష్టిస్తున్నారని, రైతులు అలాంటివేమి నమ్మకూడదని కోరారు. ఇప్పటి వరకు మొత్తం 60,16,697 మంది రైతుల ఖాతాలకు రూ.6008.27 కోట్లు జమ చేయడం జరిగిందని అన్నారు. ఏడు ఎకరాలు ఉన్న రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. జాబితాలో మిగిలిపోయిన రైతులందరికీ ఒకటి, రెండు రోజుల్లో రైతుబంధు నిధులు జమ అవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి: