Nalgonda Mystery: నల్లగొండ జిల్లాలో అంతుచిక్కని మిస్టరీ.. ఉన్నట్లుండి తగలబడిపోతున్న దుస్తులు..!

|

Aug 02, 2021 | 7:10 AM

Nalgonda Mystery: నల్గొండ జిల్లాలో అంతుచిక్కని మిస్టరీ.. జనాలను హడలెత్తిస్తుంది. ప్రతీ రోజూ ఎవరో ఒకరి ఇంట్లో దుస్తులు, పశువుల కొట్టం..

Nalgonda Mystery: నల్లగొండ జిల్లాలో అంతుచిక్కని మిస్టరీ.. ఉన్నట్లుండి తగలబడిపోతున్న దుస్తులు..!
burned
Follow us on

Nalgonda Mystery: నల్గొండ జిల్లాలో అంతుచిక్కని మిస్టరీ.. జనాలను హడలెత్తిస్తుంది. ప్రతీ రోజూ ఎవరో ఒకరి ఇంట్లో దుస్తులు, పశువుల కొట్టం, గడ్డి వాము ఇలా ఏదో ఒకటి అగ్నికి ఆహుతి అవుతోంది. గత 22 రోజులుగా ఇదే తంతు జరుగుతోంది. అయితే, ఎందుకిలా జరుగుతుందో అంతుచిక్కడం లేదు. ప్రతీ రోజూ సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయంలో ఎవరో ఒకరి ఇంట్లో ఏదో ఒక ఘటన చోటు చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఎందుకిలా జరుగుతోందని పోలీసులను కాపలా పెట్టి ఆరా తీసినా మిస్టరీ మాత్రం వీడటం లేదు.

నల్లగొండ జిల్లా చందంపేట మండలం మురుపు నూతల గ్రామ పంచాయతీ పరిధిలోని పాత ఊరి తండాలో చోటు చేసుకున్న ఈ మిస్టరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత ఊరి తండాలో గత 22 రోజులుగా ఎవరో ఒకరి ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంది. ఒక రోజు ఒకరి ఇంట్లో దుస్తులు తగలబడితే.. మరో రోజు మరొకరి ఇంట్లో పశువుల కొట్టం తగలబడింది. ఆ మరుసటి రోజు వేరొకరి ఇంట్లో గడ్డి వాము అగ్నికి ఆహుతి అయ్యింది. ఇలా అంతుచిక్కని కారణాలతో రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరో ఒకరి ఇంట్లో ఏదో ఒక ఘటన చోటు చేసుకుంది. ఈ వింత ఘటనతో గ్రామ ప్రజలను హడలెత్తిపోతున్నారు. అసలేం జరుగుతోందని తెలుసుకునేందుకు ఊరంతా ఏకమై కనిపెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక మంత్రగాడితో ప్రత్యేక పూజలు చేయించారు. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. చివరికి పోలీసులు రంగంలోకి దిగారు. ఊరంగా కాపలా ఉన్నారు. అయినప్పటికీ.. ఆ వింత ఘటనలు మాత్రం ఆగలేదు. తాళం వేసిన ఇంట్లో కూడా దస్తులు తగలబడ్డాయి. ఈ ప్రమాదాల వెనుక మిస్టరీ ఏంటో అర్థం కాక.. పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read:

E-Rupi: బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్‌ లేకుండానే నగదు రహిత చెల్లింపులు.. ‘ఈ-రూపీ’ సిస్టమ్‌కు ఇవాళ ప్రధాని శ్రీకారం

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నారా.. ఏ కార్డుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే..!

Tokyo Olympics 2020: టోక్యో నుంచి ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్ వరకు.. భారత బ్యాడ్మింటన్ క్వీన్ 8ఏళ్ల జర్నీ..!