హైదరాబాద్ నగరంలో మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. కార్తీక మాసంలో సప్లై తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్లనే ధర పెరిగిపోయినట్లు ట్రేడర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం కిలో మటన్ రూ.800లు ఉండగా.. నవంబర్ నెలాఖరు నాటికి రూ.1000కి పైగా ధర పెరిగే అవకాశం ఉందని అంచనా. దీంతో ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానంటడంతో అల్లాడిపోతున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడ్డట్లైంది.
కార్తీక మాసంలో నగరవాసులు మాంసాహారానికి దూరంగా ఉండటంతో మటన్ వ్యాపారం కొంతమేర దెబ్బతిన్న విషయం కొంతమేర వాస్తవమే. గత ఏడాది ఇదే మాసంలో కిలో మటన్ ధర రూ.500ల నుంచి రూ.550 వరకు పలికింది. ఇక ఈ ఏడాది నవంబర్ 23తో కార్తీక మాసం ముగియనుంది. కార్తీక మాసం పూర్తైన తర్వాత తిరిగి మటన్ విక్రయాలు పుంజుకుంటాయి. ఐతే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రెట్టింపు ధర చెల్లించవల్సి వస్తుందని, పెరిగిన ధరల దృష్టా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.