Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీ గూటికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి..!

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణలో రాజకీయాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ పార్టీల్లో చేరికలు, నేతల మధ్య మాటల..

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీ గూటికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి..!
Komati Rajagopal Reddy

Updated on: Jul 27, 2022 | 12:20 PM

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణలో రాజకీయాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ పార్టీల్లో చేరికలు, నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి మొదలవుతోంది. ఇక తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ బీజేపీలో చేరిక ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, వివేక్‌లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మొత్తం సంప్రదింపుల తర్వాత బీజేపీలో చేరుతున్నట్లు సంకేతాలిచ్చారు రాజగోపాల్‌ రెడ్డి.

మూడు రోజుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో పాటు బీజేపీ నేతలు ఢిల్లికి వెళ్లనున్నారు. అక్కడి నేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలతో కోమటిరెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక కోమటిరెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌గా ఉంది. ముడుగోడు నియోజకవర్గంపై ఫోకస్‌పెట్టిన కాంగ్రెస్‌.. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపడం చర్చనీయాంశంగా మారింది. పలువురు కాంగ్రెస్‌ పెద్దలు రాజగోపాల్‌రెడ్డిలో చర్చలు జరిపినా ఫలించలేనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి