Munugode Bypoll: రికార్డులు బద్దలు కొట్టిన మునోగుడు పోలింగ్.. రాత్రి 10 గంటలవరకు ఎంత నమోదైదంటే..

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ రికార్డు స్థాయిలో నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 41వేల 805 ఓట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 2లక్షలా 20వేల మందికి పైగా ఓటు వేశారు. 

Munugode Bypoll: రికార్డులు బద్దలు కొట్టిన మునోగుడు పోలింగ్.. రాత్రి 10 గంటలవరకు ఎంత నమోదైదంటే..
Munugode by-election Polling
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 04, 2022 | 7:32 AM

మునుగోడులో ఓటింగ్‌ శాతం భారీగా పెరిగింది. ఉప ఎన్నిక పోలింగ్‌ గత ఎన్నికల రికార్డును బద్ధలు కొట్టింది. మొత్తం 93.13 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 2లక్షల41వేల855 మంది ఓటర్లు ఉండగా.. దాదాపు 2లక్షలా 20వేల 192 మందికి పైగా ఓటు వేశారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 41వేల 805 ఓట్లు ఉన్నాయి. ఇందులో మెజార్టీ ఓటర్ల వయస్సు 30 నుంచి 40 ఏళ్ల మధ్యే ఉంది. పైగా ఈ సారి మహిళా ఓటింగ్‌ కూడా పెరిగినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఓటు వేయడానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.. చాలా పోలింగ్‌ కేంద్రాల్లో.. చాలా సేపు ఎండలో నిలబడి మరీ ఓటేశారు.. చివరి గంటలో వారి సంఖ్య మరింత పెరగింది.

పెద్ద ఎత్తున వృద్ధులు, వికలాంగులు..

అయితే ఈ సారి మునుగోడు ఉప ఎన్నికలో వృద్ధులు కూడా పెద్దసంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి నిల్చోవడమే ఇందుకు నిదర్శనం.. దీనికి తోడు నియోజకవర్గంలో అనారోగ్య కారణాలతో 739 మంది పోస్టల్‌ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.. వీరు కూడా ఉపయోగించుకుని ఉంటారని అధికారు అభిప్రాయ పడుతున్నారు. వీరి కోసం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మాదిరిగా ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఏర్పాటు చేశారు. వీరిలో 696 మంది ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారట..

రాత్రి 9-10 గంటల వరకు..

సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసిన తర్వాత క్యూలైన్లలో నిల్చున్నవారికి అవకాశం కల్పించారు. ఆ లైన్లు భారీగా ఉండడంతో రాత్రి 9-10 గంటల వరకు కూడా ఓటు వేసే ప్రక్రియ కొనసాగింది.

ఎలక్షన్ కమిషన్ కూడా ఫెయిల్

మునుగోడు బైపోల్ కోసం టీఆర్‌ఎస్ అనేక అరాచకాలకు పాల్పడిందన్నారు బండి సంజయ్‌. ఎలక్షన్ కమిషన్ కూడా ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. అయితే బండి చేసిన కామెంట్స్‌కి కేసీఆర్‌ గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నియమించే ఈసీనీ విమర్శించే దిగజారుడు మాటలు ఆపాలన్నారు.

మరిన్ని మునుగోడు వార్తల కోసం