Munnuru Ravi: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల్లో మున్నూరు రవి ఫోటో వివాదంగా మారింది. ఈ ప్లీనరీలో మున్నూరు రవి ఫో వివాదంపై బషీరాబాద్ సీఐ రమేష్ (CI Ramesh) వివరణ ఇచ్చారు. పార్టీ ప్లీనరీ (TRS Plenary)కి మహబూబ్‌నగర్‌కి చెందిన మున్నూరు రవి హాజరయ్యాడు. ప్లీనరీకి హాజరవడమే కాదు కొందరు నేతలతో కలిసి ఆయన ఫోటోలు కూడా దిగారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించిన సమయంలో రవి ప్లీనరీలోనే ఉన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి ఇలా ప్లీనరీలో ప్రత్యక్షమవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రవి ఇలా ఫోటో దిగడంపై సీఐ వివరణ ఇచ్చారు. ప్లీనరీలో 60 మంది నాతో ఫోటో దిగారు. ఇంత మందిలో మున్నూరు రవి కూడా ఒకరు. తాను నాతో ప్రత్యేకంగా ఫోటో దిగలేదని వివరించారు. అయితే సెక్యూరిటీ, బార్ కోడ్ పాసులున్నా మున్నూరు రవి ఎలా వచ్చాడని ఆరా తీస్తున్నారు. ఐడీ కార్డుతో ప్లీనరీ హాల్‌లోకి ప్రవేశించిన్నట్లు గుర్తించారు. ఇప్పుడు పొలిటికల్‌గా ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
టీఆర్ఎస్ ఆవిర్భావం కార్యక్రమంలో కీలక నేతలను మాత్రమే ఆహ్వానించారు. కేవలం 3వేల మందికి మాత్రమే పాసులు ఇచ్చారు. అయితే మున్నూరు రవి ఇతరుల పాస్‌పై అక్కడికి వచ్చాడా..? లేక అతనికి కూడా పాస్ అందిందా అన్న చర్చ జరుగుతోంది. పార్టీ ఐడెంటిటీ కార్డుతోనే రవి ప్లీనరీకి వచ్చాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్లీనరీకి హాజరుకావడంపై మున్నూరు రవి స్పందిస్తూ… పార్టీలో సీనియర్ కార్యకర్తగా ప్లీనరీకి హాజరయ్యానని చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుమించి తానేమీ మాట్లాడలేనని చెప్పినట్లు సమాచారం.
కాగా, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. దీనిపై అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ ఘటనపై పొలిటికల్ కామెంట్స్ నడుస్తుండగానే, విచారణ ప్రారంభించారు పోలీసులు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి