Mulugu MLA Seethakka: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

|

Sep 21, 2021 | 4:27 PM

Mulugu MLA Seethakka:  ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లాలోని ఎటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన..

Mulugu MLA Seethakka: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Mulugu Mla Seethakka
Follow us on

Mulugu MLA Seethakka:  ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లాలోని ఎటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా యాత్రలో ఆమె పాల్గొన్నారు. కాగా, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దాలర్‌కు వినతిపత్రం అందించే క్రమంలో అస్వస్థతకు గురై సీతక్క ఒక్కసారిగా కిందపడిపడిపోయారు. దీంతో వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దళిత గిరిజన దండోర యాత్ర సందర్భంగా స్థానిక మార్కెట్‌ నుంచి తహసీల్‌ కార్యాలయం వరకు 4 కిలోమీటర్ల మేర సీతక్క పాదయాత్ర చేశారు. అనంతరం తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించిన తర్వాత కార్యాలయం బయట కూర్చున్న సీతక్క ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. శరీరమంతా చెమటలు పట్టాయి. అక్కడే ఉన్న కార్యకర్తలు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం సీతక్క అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీతక్క అస్వస్థతకు గురవడంతో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. సమయానికి ఆస్పత్రిలో సూపరింటెండెంట్ లేకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యే సీతక్క తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. అన్ని వర్గాల్లోనూ ఆమెను అభిమానించేవారున్నారు. కోవిడ్ సమయంలో అటవీ ప్రాంతాల్లోని మారూముల గ్రామాలకు కాలినడకన వెళ్లి ఆమె సహాయం చేసిన తీరును ఎవరూ మర్చిపోలేరు. పేదలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా వారిని ఆదుకోవడంలో,వారి తరుపున పోరాడటంలో సీతక్క ముందుంటారు.

ఇవీ కూడా చదవండి:

Bank New Rules: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? ఈ విషయాలు తెలుసుకోండి.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న నిబంధనలు

HDFC Loan: పండగ సీజన్‌లో రుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన.. రుణ గ్రహీతలకు అదిరిపోయే ఆఫర్‌..!