Munugode Bypoll: తమ్ముడికే అన్న సపోర్ట్.. చెప్పకనే చెప్పేసిన వెంకట్ రెడ్డి.. సంచలనంగా మారిన వీడియో..

|

Oct 12, 2022 | 12:43 PM

కుటుంబమా.. రాజకీయమా.. ధర్మమా.. అనుబంధమా.. పార్టీకి సపోర్ట్ చేయాలా.. సోదరుడి పక్షాన ఉండాలా.. ఇప్పుడివే కోమటిరెడ్డి బ్రదర్స్‌ను వెంటాడుతున్న..

Munugode Bypoll: తమ్ముడికే అన్న సపోర్ట్.. చెప్పకనే చెప్పేసిన వెంకట్ రెడ్డి.. సంచలనంగా మారిన వీడియో..
Mp Komatireddy Venkat Reddy
Follow us on

కుటుంబమా.. రాజకీయమా.. ధర్మమా.. అనుబంధమా.. పార్టీకి సపోర్ట్ చేయాలా.. సోదరుడి పక్షాన ఉండాలా.. ఇప్పుడివే కోమటిరెడ్డి బ్రదర్స్‌ను వెంటాడుతున్న చిక్కుముడులు. మనసులో ఒక క్లారిటీ ఉన్నప్పటికీ.. బయటకు మాత్రం కవర్ చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. అవును, మునుగోడు ఉపఎన్నిక కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. మనసు అక్కడ.. మనిషి ఇక్కడ అన్నట్టుగా ఉంది ఇద్దరి పరిస్థితి. ఈ అన్నదమ్ముల అనుబంధం మునుగోడు ఉపపోరులో సంచలనంగా మారుతోంది.

అవును, అన్న కాంగ్రెస్‌లో.. తమ్ముడు బీజేపీలో.. మధ్యలో మునుగోడు ఉపఎన్నిక. ఇదే అంశంపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ ఏర్పాటు చేయగా ఇద్దరు బ్రదర్స్ ఓపెన్‌ అయ్యారు. నాలుగు రోజుల కిందట మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి తన అన్న ధర్మం వైపే నిలబడతారని అన్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ప్రచారానికి డుమ్మా కొట్టి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫారిన్‌ టూర్‌కి చెక్కేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతలో రెస్పాండ్ అయిన వెంకట్ రెడ్డి.. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో పాల్గొని ఆన్సర్ ఇచ్చారు. డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోయినా.. ఆయన మనసులోని ఉద్దేశంలో ఏంటో అందరికీ అర్థం అయ్యేలా క్లారిటీ ఇచ్చారు.

బిగ్‌న్యూస్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న ఎంపీ వెంకట్ రెడ్డిని టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ సూటి ప్రశ్న వేశారు. టికెట్ ఇచ్చి ఇంతటి స్థాయికి చేరుకోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మద్ధతిస్తారా? లేక రక్తసంబంధంపై ప్రీతితో మీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్ధతు ఇస్తారా? అని ప్రశ్నించారు. దీనికి ఆయన డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోయినా.. ‘మీ అక్క ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరికి మద్ధతిస్తారు?’ అంటూ రజినీకాంత్‌‌ను రివర్స్ ప్రశ్నించారు. దానికి స్పందించిన ఆయన ‘మా అక్కకే సపోర్ట్ చేస్తాను అంటే.. మీరు కూడా మీ తుమ్ముడికే సపోర్ట్ చేస్తారా?’ అని మళ్లీ ప్రశ్నించారు. అలర్ట్ అయిన వెంకట్ రెడ్డి టాపిక్ డైవర్ట్‌ చేసే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

మొత్తంగా మొన్న తమ్ముడు, నిన్న అన్న తమ మనసులోని మాటను బయటపెట్టి.. మునుగోడు పొలిటికల్ హీట్‌ను మరింత పెంచారు. టీవీ9 బిగ్‌ న్యూస్ బిగ్ డిబేట్‌లో వెంకట్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యర్థులు ఆ వీడియోను షేర్ చేస్తూ ఇవి కదా కోవర్ట్ రాజకీయాలు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఇంట్రస్టింగ్ కామెంట్స్ 16.20 నిమిషాల వద్ద నుంచి చూడొచ్చు..

తమ్ముడు అలా.. అన్న ఇలా..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..