Komatireddy Venkat Reddy: రేపటినుంచి నా తడాఖా ఎంటో చూపిస్తా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

|

Nov 06, 2021 | 2:10 PM

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి

Komatireddy Venkat Reddy: రేపటినుంచి నా తడాఖా ఎంటో చూపిస్తా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Komatireddy Venkat Reddy
Follow us on

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి తన ఉద్యమాన్ని మొదలుపెడుతానని.. రేపటి నుంచి తన సంగతేంటో చూపిస్తానని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రాణమని.. సోనియాగాంధీ తన దేవతని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ నేతలే అప్పుడు దయ్యం – ఇప్పుడు దేవత అంటున్నారంటూ ఆయన పేర్కొన్నారు. పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారంటూ మళ్లీ పార్టీ నాయకులపై అసంతృప్తిని వెళ్లగక్కారు. 72- 78 సీట్లు వస్తాయని మంత్రులు- ముఖ్యమంత్రి పదవిని పంపకాలు చేసుకున్నారంటూ ఆరోపించారు. తాను జిల్లా లీడడర్‌ని అని.. వాళ్లంతా పెద్ద, గొప్ప స్థాయి లీడర్లు అంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో కాంగ్రెస్‌ లేదనుకుంటే 6 వేల ఓట్లు వచ్చాయని.. తెలంగాణలో ప్రభుత్వం వస్తదని చెప్పుకున్నా డిపాజిట్లే రాలేదంటూ పేర్కొన్నారు. గెలుపు, ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు. ఇక రాజకీయాలను పక్కన పెట్టి కేసీఆర్ ను గద్దెదింపేందుకు, ప్రజల గురించి ఆలోచన చెయ్యాలన్నారు. కేటీఆర్ సూటు బూటు వేసుకుంటే పెట్టుబడులు రావంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయంటూ ఆయన వెల్లడించారు. కేటీఆర్ ఎందుకు రైతుల గురించి వాళ్ళ కష్టాల గురించి మాట్లాడరంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుబంధు వల్ల ఎవరికి ఉపయోగం చేకూరిందంటూ విమర్శించారు. తమ ఛత్తీస్ఘఢ్‌ ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలంటూ కోమటిరెడ్డి సూచించారు.

కొంతకాలం నుంచి అంసతృప్తితో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు రంగంలోకి దిగారు. ఈ మేరకు వీహెచ్ శనివారం కాంగ్రెస్‌ లెజిస్లేటర్ పార్టీ (సీఎల్పీ) కార్యాలయంలో కోమటిరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించిన నాటినుంచి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఘోర ఓటమిపై ఆయన పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

Mobile Chat App: మొబైల్ చాటింగ్‌కు బానిసై.. ఇంటినుంచి పారిపోయిన బాలుడు.. అసలు విషయం తెలిస్తే షాకే..

Crime News: నిందితుడిని పట్టిచ్చిన చెప్పు.. యువకుడి హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..