Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Chat App: మొబైల్ చాటింగ్‌కు బానిసై.. ఇంటినుంచి పారిపోయిన బాలుడు.. అసలు విషయం తెలిస్తే షాకే..

Maharashtra boy addicted to mobile chat app: ఓ బాలుడు సోషల్ మెసేజింగ్ మొబైల్ ఫోన్ యాప్‌కు బానిసయ్యాడు. రోజూ ఫోన్లో గంటల తరబడి చాటింగ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా

Mobile Chat App: మొబైల్ చాటింగ్‌కు బానిసై.. ఇంటినుంచి పారిపోయిన బాలుడు.. అసలు విషయం తెలిస్తే షాకే..
Mobile Chat App
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 06, 2021 | 1:48 PM

Maharashtra boy addicted to mobile chat app: ఓ బాలుడు సోషల్ మెసేజింగ్ మొబైల్ ఫోన్ యాప్‌కు బానిసయ్యాడు. రోజూ ఫోన్లో గంటల తరబడి చాటింగ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. మహారాష్ట్రలో మాయమై.. గోవాలో ప్రత్యేక్షమయ్యాడు. అసలేందుకు బాలుడు ఇంటినుంచి వెళ్లిపోయాడో తెలుసుకొని పోలీసులే ఆశ్చర్యపోయారు. మెసేజింగ్ మొబైల్ ఫోన్ యాప్‌కు బానిసై ఇంట్లో నుంచి పారిపోయిన పదమూడేళ్ల బాలుడికి సంబంధించిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్‌లో చోటుచేసుకుంది. బాద్లాపూర్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు అక్టోబర్‌ 31న ఇంటినుంచి బయలు దేరి వెళ్లి.. గోవాలో ప్రత్యేక్షమయ్యాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన బాలుడిని సురక్షితంగా పట్టుకొని అతని తల్లిదండ్రులకు అప్పగించారు.

తాను ఒక సంవత్సరంపాటు రానని.. ఇంటికి దూరంగా ఉంటానని తల్లిదండ్రులకు చెప్పి ఆ బాలుడు ఇంటినుంచి బయలు దేరాడని పోలీసులు తెలిపారు. అప్పుడు తల్లిదండ్రులు బాలుడి మాటలను పట్టించుకోలేదు. ఆ తర్వాత నిజంగానే ఇంటినుంచి వెళ్లడంతో బద్లాపూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సందేశ్ మోర్ తెలిపారు. ఆ తర్వాత పోలీసులు.. అతని స్నేహితులను విచారించగా.. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడు డిస్కార్డ్ మొబైల్ యాప్‌లో ఇతర పిల్లలతో కనెక్ట్ అయ్యాడని.. ప్రతిరోజూ గంటల తరబడి గ్రూప్‌లో చాట్ చేసేవాడని వారు తెలిపారు. అయితే.. చాట్ గ్రూప్ సభ్యులు తమను తాము నిరూపించుకోవడానికి.. జీవితంలో ఏదైనా చేయాలని తమ ఇళ్లను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని.. వారి మాటలను నమ్మి ఇంటినుంచి వెళ్లిపోయాడని అతని స్నేహితులు పోలీసులకు చెప్పారు.

అనంతరం థానే సైబర్ సెల్.. బాలుడి మొబైల్ ఫోన్ ఐపి అడ్రస్‌ను ట్రేస్ చేసి.. చాట్‌లను కనుగొన్నారు. అతను గోవాలో ఉన్నట్లు నిర్ధారించుకొని అక్కడికి చేరుకున్నారు. బాలుడిని గోవాలోని కలంగుటే వద్ద గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతను కొల్హాపూర్ మీదుగా గోవాకు చేరుకున్నాడని.. పోలీసు అధికారి తెలిపారు. ఆ తర్వాత బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Viral Video: ఫోన్ మైకంలో ఉండగా.. ప్యాంటులోకి దూరిన ఎలుక.. ఆ తర్వాత ఏమైందంటే.. వీడియో

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సికింద్రాబాద్ – అగర్తలా మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లు

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!