రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతున్నాయి. చలి వాతావరణంలోనూ శగలు పుట్టిస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు భగ్గమంటుండగా.. కాంగ్రెస్ నేతలు సైతం అంతే ధీటుగా స్పందిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 11 గంటలు మించి విద్యుత్ సరఫరా ఉన్నట్టు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు.
గురువారం నాడు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా అనేది పచ్చి అబద్ధం అన్నారు. 11గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఆ 11గంటల కరెంటు సరఫరాలోనూ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో ఉద్యోగుల సమస్యలపైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విరమ్శలు గుప్పించారు. ప్రభుత్వం కారణంగా ఉద్యోగులంతా కష్టాల్లో ఉన్నారని అన్నారు. సమయానికి జీతాలు రాక, EMIలు కట్టలేక ఉద్యోగులు అప్పులపాలవుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..