Motherhood: మరణించిన భర్తతో సంతానాన్ని పొందాలనుకున్న మహిళ.. సైన్స్ సాయంతో పండంటి బిడ్డకు జన్మ..

| Edited By: Janardhan Veluru

Apr 08, 2022 | 10:16 AM

Motherhood: భార్యాభర్తల బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత.. దంపతులు తమ జీవితం తల్లిదండ్రులుగా మారిన తర్వాతనే పరిపూర్ణమైందని భావిస్తారు. అమ్మానాన్న అని తమ పిల్లలు పిలిచే పిలుపు కోసం..

Motherhood: మరణించిన భర్తతో సంతానాన్ని పొందాలనుకున్న మహిళ.. సైన్స్ సాయంతో పండంటి బిడ్డకు జన్మ..
Motherhood After Husband De
Follow us on

Motherhood: భార్యాభర్తల బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత.. దంపతులు తమ జీవితం తల్లిదండ్రులుగా మారిన తర్వాతనే పరిపూర్ణమైందని భావిస్తారు. అమ్మానాన్న అని తమ పిల్లలు పిలిచే పిలుపు కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. మాతృత్వంలోని మధురిమలు కోసం భార్య, పితృత్వంలోని మాధుర్యం కోసం భర్త ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే అమ్మానాన్న అయ్యే అదృష్టం కొంతమందికి అంత ఈజీగా దొరకదు.. ఏళ్లకు తరబడి.. ఎదురుచూస్తారు.. కనిపించని దేవుళ్ళకు మొక్కుతారు.. కనిపించే వైద్యులను ఆశ్రయిస్తారు.. అయితే ఓ మహిళ తాను కూడా తల్లి కావాలనుకుంది. అయితే మరణించిన తన భర్త సంతానాన్ని పొందాలనుకుంది.. అందుకు సైన్స్ ను ఆశ్రయించింది.. భర్త మరణించిన తర్వాత కూడా అతని బిడ్డకు తల్లయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వాన్ని పొందింది. ఈ ఘటన తెలంగాణా(Telangana)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మంచిర్యాలకు చెందిన ఓ జంటకు 2013 లో వివాహమైంది. అయితే ఈ జంటకు ఎంతకాలానికి పిల్లలు పుట్టలేదు. దీంతో ఈ దంపతులు వరంగల్ లోని ఒయాసిస్‌ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో 2020 మార్చిలో సంతాన సాఫల్య  కేంద్ర వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యాభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి భద్రపరిచారు. అయితే భార్యాభర్తలను దురదృష్టం వెంటాడింది.. పిల్లలు కావాలన్న కోరిక తీరకుండానే 2021 లో భర్తకు కరోనా సోకి మరణించాడు.

తన భర్త అకాలంగా మరణించడంతో 32 ఏళ్ల మహిళ కుంగిపోయింది. దీంతో చిన్న వయసులో భర్తను పోగట్టుకున్న కోడలకి అండగా అత్తమామలు నిలబడ్డారు. తమ కొడుకుని పోగొట్టుకున్నా.. కోడలు బాగుండాలని కోరుకున్నారు.. మరో పెళ్లి చేసుకోమని కోడలికి సూచించారు. అయితే తాను మరో పెళ్లి చేసుకోనని.. అత్తమామలతో ఉంటానని తెలిపారు. అంతేకాదు.. సంతాన సాఫల్య కేంద్రంలో భర్త వీర్యం ద్వారా తాను తల్లిని కావాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని అత్తమామలకు తెలిపారు. అందరి అంగీకారంతో ఆధునిక వైద్యసాయం అందుకున్నారు. వైద్య నిపుణుల సలహాలను సూచనలు తీసుకున్నారు. అయితే ముందుగా తాను తల్లి అయ్యే విషయంలో ఎటువంటి చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోకూడదని భావించిన ఆ మహిళ.. ముందుగా హైకోర్టుకి వెళ్లారు. దీంతో కోర్టు ఆ మహిళ ఇష్టమే ఫైనల్ అని తీర్పు చెప్పింది.

దీంతో ఆ మహిళ సంతాన సాఫల్య  కేంద్రలో దంపతుల నుంచి సేకరించి భద్రపరచిన వీర్యం, అండాల ద్వారా వైద్య బృందం ఐవీఎఫ్‌ చికిత్స ప్రారంభించారు. ఆగస్టు 2021లో ఆసుపత్రి సిబ్బంది ఐవీఎఫ్‌ చికిత్స ప్రారంభించారు. వారి చికిత్స సక్సెస్ అయింది. మహిళ గర్భవతి అయింది. 2022 మార్చి 22న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Also Read: Funny Viral Video: వరుడుకి లిప్‌లాక్‌ కిస్‌ ఇచ్చిన అనుకోని అతిధి.. పెళ్లికూతురు రియాక్షన్ చుస్తే మైండ్ బ్లోయింగ్..

Diabetes Care: డయాబెటిక్ బాధితులకు అలర్ట్.. శరీరంపై ఇలాంటి పుండ్లు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..