Telangana: యువతి ప్రాణం తీసిన వాట్సాప్ స్టేటస్.. తల్లిదండ్రులకు కడుపు కోత
ఇంటి ఎదురుగా ఉండే యువతితో దిగిన ఫొటోలను ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. అది చూసిన ఆమె తల్లిదండ్రులు ఫొటోలు తొలగించాలని అతడికి విన్నవించారు. కానీ అందుకు అతడు నిరాకరించాడు. దీంతో...
వాట్సాప్ స్టేటస్ పెట్టడం చాలా మందికి సరదా.. అవే స్టేటస్‌లు కొంత మంది ప్రైవసీకి ఇబ్బందిగా మారుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చిపెడుతున్నాయి. మంచిర్యాల జిల్లా(mancherial district)లో సేమ్ టూ సేమ్ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడు పెట్టిన వాట్సాప్ స్టేటస్.. మరో అమ్మాయి చావుకు కారణమైంది. తాండూర్ మండలం(tandoor mandal) అచ్చులాపూర్‌లోని కొమ్ము గూడెం గ్రామంలో అజయ్ అనే యువకుడు నివశిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గీత(పేరు మార్చాం) అనే అమ్మాయి హైదరాబాదు(Hyderabad)లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగకు ఇంటికి వచ్చింది. ఆమె ఇంటి ఎదురుగా ఉన్న అజయ్‌తో ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను అజయ్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో.. వాట్సాప్‌లో పెట్టిన ఫోటోలు తీసి వేయాలని కోరారు. కానీ ఫోటోలు తొలగించకుండా అజయ్.. ఫోన్ స్విచ్ ఆప్ చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన గీత బుధవారం ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అజయ్ వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని చనిపోయిన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.
Also Read: నెమలి ఈకలకు భయపడి బల్లులు పారిపోతాయా? దీంట్లో నిజమెంత..?