Mother – daughter dies: తెలంగాణలోని నల్లగొండలో విషాదం చోటుచేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నల్లగొండ పట్టణంలోని పద్మానగర్‌లో ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. పద్మానగర్‌కు చెందిన నడికుడి లక్ష్మి (42), ఆమె కూతురు కల్యాణి (21) గురువారం రాత్రి తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షాలకు శుక్రవారం తెల్లవారుజామున ఇంటిగోడ కూలిపోయింది. నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై బిరువా పడింది. దీంతో తల్లీకూతుళ్లు ఊపిరాడక నిద్రలోనే మరణించారు. తెల్లవారుజామున చూసిన పొరిగింటివారు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అంనతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. కల్యాణికి ఇటీవలే వివాహమయినట్లు స్థానికులు తెలిపారు. లక్ష్మి కుటుంబం కొన్నేండ్ల క్రితం శ్రీకాకుళం నుంచి నల్లగొండకు వలస వచ్చినట్లు తెలిపారు. వారు రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..