ఆటగదరా శివ.! కూతురు అప్పగింతల వేళ అనుకోని ఘటన.. అయ్యో పాపం..!

దేశంలో ఇటీవలే గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నట్టుండీ.. గుండె ఎందుకో సడెన్‌గా కొట్టుకోవడం మానేస్తోంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ..డాన్సులేస్తూ.. నవ్వుతూ పలకరించిన చెట్టంత మనిషులు చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. ఈమధ్యకాలంలో తరచూ ఇలాంటి కేసులే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పెళ్ళింట తీవ్ర విషాదం నెలకొంది.

ఆటగదరా శివ.! కూతురు అప్పగింతల వేళ అనుకోని ఘటన.. అయ్యో పాపం..!
Mother Dies In Daughter's Marriage

Edited By:

Updated on: Aug 18, 2025 | 1:17 PM

దేశంలో ఇటీవలే గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నట్టుండీ.. గుండె ఎందుకో సడెన్‌గా కొట్టుకోవడం మానేస్తోంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ..డాన్సులేస్తూ.. నవ్వుతూ పలకరించిన చెట్టంత మనిషులు చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. ఈమధ్యకాలంలో తరచూ ఇలాంటి కేసులే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పెళ్ళింట తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబం.. కొద్ది సేపటికే వారిలో విషాదాన్ని నింపింది.

కూతురి అప్పగింతలు చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన ఓ తల్లి. ఉదయం పెళ్లి.. సాయంత్రం విషాదం. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసు పురం గ్రామంలో జరిగిందీ సంఘటన. పెళ్లి జరిగిన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అందరూ ఆనందంలో మునిగితేలుతూ కళకళలాడ వలసిన ఆ ఇల్లు కన్నీటి సంద్రం అయింది. కూతురు పెళ్లి చేసి వియ్యాలవారికి అప్పగింతలు చేస్తున్న సమయంలో వధువు తల్లి ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందింది. దీంతో ఆ గ్రామమంతా ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

కామేపల్లి మండలం అబ్బాయి పురం గ్రామానికి చెందిన బానోతు మోహిలాల్, కళ్యాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె సింధును టేకులపల్లి మండలానికి చెందిన బాలాజీ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇంటి దగ్గరే జరిగిన వివాహం బంధుమిత్రులతో కలకలలాడింది. ఆగస్టు 17, ఆదివారం ఉదయం వివాహం జరిగింది. సాయంత్రం తన కూతురు సింధును వియ్యాలవారికి అప్పగింతలు చేస్తున్న తరుణంలో సింధు తల్లి కళ్యాణి తన కూతురు తనకు దూరమవుతుందన్న భావోద్వేగంతో హఠాత్తుగా కుప్పకూలిపోయింది.

దీంతో బంధుమిత్రులు అందరు కలిసి ఆసుపత్రికి తరలించారు. కళ్యాణిని పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించిందని నిర్ధారించారు. ఆకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో కుటుంబమంతా ఒకేసారి షాక్ గురయ్యారు. కన్నీరు మున్నేరుగా విలపించారు. ఆనంద సమయములో మునిగితేలుతున్న వేడుకల వాతావరణం మాయమైంది. ఈ హృదయ విదారకమైన సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..