Telangana Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో రేపు నైరుతి రుతుపవనాలు అడుగు పెట్టే అవకాశం ఉందని.. ఈ రుతుపవనాల ప్రభావంతో.. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అంతేకాదు.. మళ్ళీ ఆదివారం తిరిగి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో రుతుపవనాల్లో కదలిక భారీ ఉండవచ్చునని.. వీటి ప్రభావంతో.. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో సోమవారం నుంచి వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని.. ఉష్ణోగ్రతలు తగ్గాయని తెలిపారు. అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అన్నారు.
గత ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 1నే కేరళను తాకగా.. నాలుగు రోజుల్లోనే తెలంగాణాలో అడుగు పెట్టాయి. అయితే ఈ ఏడాది కేరళలో మే నెలాఖరుని నైరుతి రుతుపవనాలు అడుగు పెట్టినా… తెలంగాణలో మాత్రం రేపు అడుగు పెట్టె అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మరో వైపు తొలకరి పకరింపు వార్తలు విన్న అన్నదాత వ్యవసాయ పనులను మొదలు పెట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..