Monkey Humanity: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ వింతలు చోటు చేసుకున్నా వెంటనే తెలుస్తున్నాయి. ముఖ్యంగా జంతువులు చేసే పనులు.. చూపే తెలివితేటలు వంటి వీడియోలు ఐతే ఓ రేంజ్ లో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని వీడియో ల్లో జాతి వైరం మరచి జంతువులు చూపించే ప్రేమ ఐతే మరింత ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో అమితంగా కట్టుకుంటుంది. అందులో ఓ కోతి .. పిల్లిని రోడ్డు దాటిస్తున్నది ఉంది. ఈ ఫోటో జంతువుల్లో సాటి జీవుల పట్ల ఆదరాభిమానాలు ఉంటాయనడానికి నిదర్శనమని అంటున్నారు. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట బస్టాప్ వద్ద కరీంనగర్ రాయపట్నం రహదారిపై ఓ పిల్లి రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంది. అయితే జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న వాహనాలను తప్పించుకోలేక… రోడ్డు దాటలేక పిల్లి పిల్ల అవస్థలు పడుతుంది. ఇది చూసిన ఓ కోతి స్పందించి ఆ పిల్లి పిల్లకు సాయం చేసింది. తన చేతులతో పట్టుకుని మెల్లగా రోడ్డు దాటించింది. వాహనాలు వెళ్లే వరకు పిల్లి పిల్లను తన దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్న అది.. ఆ తర్వాతే ముందుకు కదలడం విశేషం. ఈ ఘటన పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. కోతిలోని సాయం చేసే గుణాన్ని చూసి మనుషులు కూడా ఇలా లేరు కదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కోతి ఆ పిల్లి పిల్లను పట్టుకున్న దృశ్యం చూస్తే .. మానవత్వం మాతృత్వం కలగలిపిన కోతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఓ వైపు మందాకిని మరోవైపు అలకనందానది మధ్యలో చంద్రశిలపై ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం
తెల్ల జుట్టుని నల్లగా, ఒత్తుగా పొడవుగా చేసుకోవడానికి వంటింట్లో ఉండే వస్తువులతో నేచురల్ టిప్స్