Watch Video: అప్పుడేపుట్టిన కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతి.. మిగతా కుక్కలతో కలిసి తల్లి ఏం చేసందో చూడండి

జంతువులు చేసే తింగరు పనులు చిలిపి చేష్టలు.. జనాలను ఎప్పటికప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలూ కూడా తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియోలో కోతి ఏం చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.. ఇంతకు ఆ కోతి ఏం చేసిందో తెలుసుకుందాం పదండి.

Watch Video: అప్పుడేపుట్టిన కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతి.. మిగతా కుక్కలతో కలిసి తల్లి ఏం చేసందో చూడండి
Monkey Dog Viral Video

Edited By: Anand T

Updated on: Sep 30, 2025 | 10:36 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన కుక్కపిల్లను తన పిల్ల అనుకొని ఒక వానరం ఎత్తుకెళ్ళింది. ఆ కుక్క పిల్లను హత్తుకొని ఊరంతా హల్ చల్ చేసింది.. ఆ కుక్కపిల్ల కోసం తల్లి కుక్క అరుపులు విని వీధి కుక్కలన్నీ ఒక్కటయ్యాయి. ఈ విచిత్ర సంఘటన రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే వీధి కుక్క కొన్ని పిల్లలకు జన్మనిచ్చింది. అయిగా తిరుగుతూ ఆ కుక్క పిల్లల వద్దకు వచ్చిన ఓ కోతి ఒక కుక్క పిల్లను చూసి అతి తన బిడ్డే అనుకొని దాన్ని అమాంతం చేతుల్లోకి తీసుకొని ఎత్తుకెళ్లింది.

తన పిల్ల అనుకుని కడుపుకు హత్తుకొని ఇళ్లపై తిరుగుతూ ముద్దులు పెడుతుంది. కుక్కపిల్ల కోసం తల్లికుక్క కోతి వెనుక ఎంత తిరిగినా ఆ కోతి మాత్రం వదల లేదు. దీంతో తల్లి కుక్కను చూసిన మరికొన్ని వీధి కుక్కలు దానికి తోడయ్యాయి. అన్ని కలిసి కోతి వెంబడి వెళ్లాయి. అయినా కూడా కోతి మాత్రం కుక్కపిల్లను వదలలేదు.

ఇది గమనించిన స్థానికులు ఆ కోతి చేతి నుంచి కుక్క పిల్లను విడిపించడం కోసం ఎంత ప్రయత్నం చేసినా కోతి మాత్రం వాళ్లకు దొరకలేదు. కుక్క పిల్లను కింద పడకుండా గట్టిగా పట్టుకొని చెట్ల పైనుండి గ్రామం అంతా తిరుగుతుంది. గ్రామంలో ఇళ్ల పైన కుక్క పిల్లతో కోతి సంచరిస్తుంటే.. కింద తల్లి కుక్క తల్లడిల్లిపోతున్న తీరు చూపరులను అయ్యోపాపం అనిపించింది. ఈ తతంగాన్నంత స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.