AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అబ్బా ఏం ప్లాన్ చేసినవ్ కాకా.. ఇంటి స్థలం అమ్మేందుకు అదిరే ఐడియా

వ్యాపారులు తమ సేల్స్‌ను పెంచుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు. ఎలాగైనా వినియోగదారుడు తమ వ్యాపార కేంద్రాలకు వచ్చేలా ఐడియాలు వేస్తుంటారు. వ్యక్తులు స్థలాలు, భూములను అమ్మేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన ఇంటి స్థలాన్ని విక్రయించేందుకు విచిత్రమైన ఐడియా వేశాడు. అతడి తెలివికి ఫిదా అవుతున్నారు జనం. అతని ఐడియా ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: అబ్బా ఏం ప్లాన్ చేసినవ్ కాకా.. ఇంటి స్థలం అమ్మేందుకు అదిరే ఐడియా
House Plot Lucky Draw
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 30, 2025 | 11:36 AM

Share

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన రాంబ్రహ్మం.. ఇటీవల నూతన గృహాన్ని నిర్మించుకున్నాడు. ఇదే సమయంలో చౌటుప్పల్‌లో తనకున్న రేకుల గదితో సహా 66 గజాల స్థలాన్ని అమ్మే ప్రయత్నం చేశాడు. ఏడాదిగా విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు నూతన ఇంటికి డబ్బులు చెల్లించాల్సిన వాయిదా నవంబర్‌లో ఉంది. దీంతో ఎలాగైనా ఇంటి స్థలాన్ని విక్రయించాలని రాంబ్రహ్మం ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా తన స్థలం వద్ద ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. స్థలం కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారు రూ.500 విలువైన కూపన్ ను కొనుగోలు చేసి లక్కీడ్రాలో పాల్గొనాలని జాతీయ రహదారి పక్కన ఫ్లెక్సీలు కట్టారు. దీంతో ఆ ఫ్లెక్సీలు చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

3000 కూపన్లను రాంబ్రహ్మం ముద్రించాడు.. కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు ఆ కూపన్స్‌ను కొనుగోలు చేసి తమ పూర్తి వివరాలను రాసి వేసేందుకు ఓ డబ్బాను కూడా ఏర్పాటు చేశాడు. ఈ లక్కీ డ్రాను నవంబర్ రెండో తేదీన తీసేందుకు  ఏర్పాటు చేశాడు. స్థానిక మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం, గది విలువ రూ.16 లక్షలు ఉంటుందని.. ఏడాదిన్నర కాలంగా ఈ స్థలాన్ని అమ్మకానికి పెట్టినప్పటికీ సరైన ధర రాలేదని రాంబ్రహ్మం చెబుతున్నాడు. అందుకే ఇలాంటి కొత్త ఐడియాతో తన ఇంటి స్థలాన్ని విక్రయించేందుకు సిద్ధమయ్యానని చెబుతున్నాడు. కూపన్స్, లక్కీ డ్రాను నవంబర్ రెండో తేదీన నిర్వహిస్తానని చెబుతున్నాడు. ఇంటి స్థలాన్ని అమ్మేందుకు లక్కీ డ్రా అనే పద్ధతి సరైనది కానప్పటికీ.. రాంబ్రహ్మం ఐడియాను మాత్రం అందరూ సూపర్ అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే