AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Vani Devi: అసెంబ్లీలో ఎమ్మెల్సీ వాణీదేవి వాహనానికి ప్రమాదం.. గన్‌మెన్ నడపడంతో..

Car Accident at Assembly: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఇటీవల విజయం సాధించిన సురభి వాణిదేవి.. వాహనం ప్రమాదానికి

MLC Vani Devi: అసెంబ్లీలో ఎమ్మెల్సీ వాణీదేవి వాహనానికి ప్రమాదం.. గన్‌మెన్ నడపడంతో..
Car Accident
Shaik Madar Saheb
|

Updated on: Mar 25, 2021 | 11:21 AM

Share

Car Accident at Assembly: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఇటీవల విజయం సాధించిన సురభి వాణిదేవి.. వాహనం ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం వాణీదేవి శాసన మండలికి వస్తుండగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి రాగానే రైల్వే కౌంటర్‌ వద్ద కారు అదుపుతప్పి గేటును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ఎదుట భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో వాణిదేవి గన్‌మెన్‌ కారు నడిపినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిగత అధికారిని సస్పెండ్‌ చేసినట్టు సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలం నుంచి కారును తరలించారు.

అయితే ఇటీవల జరిగిన హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వాణీదేవీ టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. బీజేపీకి చెందిన రామచందర్‌రావు ఆమె చేతిలో ఓటమిపాలయ్యారు.

Also Read:

Family Sucide: మంచిర్యాలలో విషాదం.. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య

Coronavirus Lockdown: తెలంగాణకు ఆనుకుని ఉన్న ఆ జిల్లాలో కఠిన లాక్‌డౌన్.. ప్రజా రవాణా బంద్..