MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. మరోసారి తెరపైకి ఎమ్మెల్సీ కవిత పేరు.. ఇంట్రెస్టింగ్ గా మారిన లేటెస్ట్ అప్డేట్..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్‌లో మరోసారి కవిత పేరును యాడ్ చేశారు ఈడీ అధికారులు. కవిత ప్రతినిధిగా అరుణ్‌..

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. మరోసారి తెరపైకి ఎమ్మెల్సీ కవిత పేరు.. ఇంట్రెస్టింగ్ గా మారిన లేటెస్ట్ అప్డేట్..
MLC Kavitha
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 11, 2023 | 8:04 PM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్‌లో మరోసారి కవిత పేరును యాడ్ చేశారు ఈడీ అధికారులు. కవిత ప్రతినిధిగా అరుణ్‌ పిళ్లై వ్యవహరించారని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం ఈ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అంకౌంటెంట్ (సీఏ) గోరంట్ల బుచ్చిబాబుకు ఢిల్లీ సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 8న సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. బుచ్చిబాబును 14 రోజుల కస్టడీ విధించింది.

ఇప్పటికే పలువురుని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు చేసిన అనంతరం ఆయనను అరెస్టు చేశారు. వారం రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు.

కాగా.. గతేడాది డిసెంబర్ లో ఢిల్లీ సీబీఐ విభాగానికి చెందిన ఎస్పీ స్థాయి మహిళ అధికారి సహా అయిదుగురు అధికారుల బృందం కవితను సుదీర్ఘంగా విచారించారు. ఢిల్లీ మద్యం కేసులో.. 160 సీఆర్‌పీసీ చట్టం ప్రకారం సాక్షిగా విచారించనున్నామని… సీబీఐ ముందుగానే కవితకు సమాచారం పంపింది. ఈ మేరకు కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు.. మద్యం కేసులో ప్రశ్నలు సంధించారు. కవిత వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!