MLC Kavitha: ఢిల్లీ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. వెంట మంత్రి కేటీఆర్‌.. సోమవారం ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ

|

Mar 19, 2023 | 8:28 PM

కవిత-ఈడీ ఎపిసోడ్‌ సస్పెన్స్‌ సీరియల్‌లా సాగుతోంది. రాజకీయ వర్గాలు కూడా ఊహించలేనంత మలుపులు తిరుగుతూ పొలిటికల్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సీను సీనుకు హై డ్రామా పండిస్తూ పొలిటికల్‌ సినిమాను తలపిస్తోంది

MLC Kavitha: ఢిల్లీ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. వెంట మంత్రి కేటీఆర్‌.. సోమవారం ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ
MLC Kavitha
Follow us on

కవిత-ఈడీ ఎపిసోడ్‌ సస్పెన్స్‌ సీరియల్‌లా సాగుతోంది. రాజకీయ వర్గాలు కూడా ఊహించలేనంత మలుపులు తిరుగుతూ పొలిటికల్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సీను సీనుకు హై డ్రామా పండిస్తూ పొలిటికల్‌ సినిమాను తలపిస్తోంది. తాజాగా కవిత చలో ఢిల్లీ అనడంతో అందరి చూపు హస్తినపై పడింది. ఇంతకీ ఢిల్లీ లిక్కర స్కామ్‌ కేసులో ఆమె రేపు ఈడీ విచారణకు హాజరవుతారా? లేక మరో ట్విస్టు ఉంటుందా? ఇక ఈ కేసు క్లైమాక్స్‌కు చేరనుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. బేగంపేట నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. వెంట మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారించాలని ఈడీ కవితకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణ, కోర్టు వాయిదాలు.. నిందితుల కస్డడీ ఇలా చాలా పరిణామాలు కేసు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు.. 16న మరోసారి హాజరుకావాలని ఆదేశించారు. అయితే ఢిల్లీ వెళ్లిన కవిత విచారణకు మాత్రం హాజరుకాలేదు. తన ప్రతినిధిగా సోమ భరత్ కుమార్‌ను ఈడీ కోరిన బ్యాంకు స్టేట్‌మెట్లు, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పంపించారు. విచారణకు హాజరుకానప్పటికీ దాన్ని గైర్హాజరుగా పరిగణించలేని పరిస్థితిని సృష్టించారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. 20న విచారణకు రావాలని సూచించింది. ఈడీ జారీ చేసిన నోటీసుల్లో ఈసారి వ్యక్తిగతంగా అన్న పదాన్ని ప్రస్తావించారని.. ఈ పరిస్థితుల్లో కవిత రేపు విచారణను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది.

విచారణలో భాగంగా కవితను తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో పాటుగా ప్రశ్నించాలని భావిస్తోంది. అయితే కవిత విచారణపై రేపే క్లారిటీ రానుంది.  ఫైనల్‌గా కవిత-ఈడీ ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఆమె రేపు విచారణకు హాజరవుతారా? లేదంటే ఇంతకుముందులాగే న్యాయవాదిని పంపిస్తారా? వీటికి మించి అనూహ్యమైన ట్విస్ట్‌లేమైనా చోటు చేసుకుంటాయా అన్న ఉత్కంఠ మొదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..