MLC Kavitha Injury: ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3 వారాలు విశ్రాంతి..

తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కాలికి గాయమైంది. పరీక్షించిన వైద్యులు.. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘నా కాలికి గాయం (Avulsion Fracture) అవ్వడంతో మూడు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

MLC Kavitha Injury: ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3 వారాలు విశ్రాంతి..
Mlc Kavitha

Updated on: Apr 11, 2023 | 12:40 PM

తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కాలికి గాయమైంది. పరీక్షించిన వైద్యులు.. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘నా కాలికి గాయం (Avulsion Fracture) అవ్వడంతో మూడు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది.) అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. కాగా, కవితకు గాయం గురించి తెలుసుకున్న ఆమె అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..