MLC Jeevan Reddy: రాజీనామాలను ఆమోదించండి.. గవర్నర్ తమిళిసైకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ..

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్నా.. గవర్నర్ వాటిని ఆమోదించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే దీనిపై గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

MLC Jeevan Reddy: రాజీనామాలను ఆమోదించండి.. గవర్నర్ తమిళిసైకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ..
Jeevan Reddy-Governor Tamilisai
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 09, 2024 | 3:10 PM

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్నా.. గవర్నర్ వాటిని ఆమోదించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే దీనిపై గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జీవన్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు లేఖ రాశారు. TSPSC చైర్మన్‌, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. నెల రోజులు గడుస్తున్నా రాజీనామాలు ఆమోదించడం లేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందంటూ పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలోని TSPSC బోర్డు అనేక అవకతవకలకు పాల్పడిందని.. బోర్డు తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. TSPSC చైర్మన్ రాజీనామాను ఆమోదించకపోవడం వల్ల నియామకాల ప్రక్రియ జాప్యం జరుగుతోందన్నారు.

ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జీవన్ రెడ్డి.. పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో గవర్నర్ త్వరగానిర్ణయం తీసుకోవాలని.. TSPSC చైర్మన్ సహా సభ్యుల రాజీనామాలను ఆమోదించాలని కోరారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..