Mla vs Forest Officers: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పోడు భూముల వ్యవహారమై.. కొన్నేళ్ల నుంచి ఎమ్మెల్యే వర్సెస్ ఫారెస్ట్ అధికారులు అన్నట్లుగా కథ నడుస్తోంది. తాజాగా బొల్లెపల్లి ఘటనపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. గూడూరులో జరిగిన బతుకమ్మ చీరెల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఫారెస్ట్ అధికారులపై ధ్వజమెత్తారు. తాను బొల్లెపల్లికి వెళ్తున్నానని, దమ్ముంటే తనను ఆపండి అంటూ ఫారెస్ట్ అధికారులకు సవాల్ విసిరారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. బక్క రైతులపై మీ ప్రతాపమా? అంటూ నిప్పులు చెరిగారు. రైతుల మిర్చి నారు పీకేసేంత ధైర్యం మీకు ఎక్కడిదంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. ‘‘మొక్కే కదా అని పీకేసారు కదా, దాని రిజల్ట్ చూడండి.’’ అంటూ ఫారెస్ట్ ఆఫీసర్లుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే శంకర్ నాయక్.
రైతుల జోలికి రావొద్దని చేతులు జోడించి మొక్కాను అయినా మీలో మార్పు రాలేదంటూ అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపించారు ఎమ్మెల్యే. మిర్చి చెనులో నార్లు పీకేసి, రైతుల చొక్కాలు చించేయడం దారుణం అని అధికారుల తీరుపై మండిపడ్డారు. అడవుల ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. అడవులు తరిగిపోవడానికి కారణం ఎవరో మీకు తెలియదా? అంటూ ఫారెస్ట్ ఆఫీసర్స్‌ని ప్రశ్నించారు. సీఎం ఆదేశాలను భేఖాతరు చేసేంత దమ్ము మీకు ఎక్కడిదంటూ ఫారెస్ట్ అధికారులపై ఫైర్ అయ్యారు. అనంతరం.. పోడు భూముల సభా సంఘం చైర్మన్ మంత్రి సత్యవతితో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడారు. ఫారెస్ట్ అధికారుల నిర్వాకం గురించి మంత్రికి వివరించారు.
Also read:
Pension: అధికారుల నిర్వాకం.. భర్త బతికుండగానే భార్యకు వితంతు పెన్షన్.. ఎక్కడంటే..