Telangana: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్..

|

Sep 09, 2024 | 8:09 PM

పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేషన్, పబ్లిక్ టేకింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ శాసనసభ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ నియమించింది. ఎస్టిమేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్.పద్మావతిరెడ్డి.. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా కె.శంకరయ్య నియమితులయ్యారు.

Telangana: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్..
Telangana Politics
Follow us on

పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేషన్, పబ్లిక్ టేకింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ శాసనసభ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ నియమించింది. ఎస్టిమేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్.పద్మావతిరెడ్డి.. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా కె.శంకరయ్య నియమితులయ్యారు. ఒక్కో కమిటీలో 12 మంది చొప్పున సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని నియమించడంపై బీఆర్ఎస్ మండిపడింది. ఇలా చేయడం సమంజసం కాదని.. ఆనవాయితీని తుంగలో తొక్కారంటూ విమర్శించింది.

ప్రతిపక్షాలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీ అన్న హరీష్‌రావు.. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న అరికెపూడి గాంధీకి ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని చెప్పే నీతి మాటలన్నీ అబద్ధాలే అని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు చెందిన కేసీ వేణుగోపాల్‌కు పీఏసీ చైర్మన్ పదవి ఇప్పించుకున్నారని.. ఇక్కడ మాత్రం సొంత పార్టీ వారికే ఈ పదవి ఇచ్చుకున్నారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ నుంచి నామినేషన్‌ వేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు..

ఇక పీఏసీ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ నుంచి ముగ్గురు నామినేషన్ వేశారు. మాజీమంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి ఈ పదవి కోసం నామినేషన్ వేశారు. పార్టీ మారిన అనంతరం అరికెపూడి గాంధీతో కాంగ్రెస్ నామినేషన్ వేయించింది. చివరకు పీఏసీ చైర్మన్‌గా గాంధీ నియమితులయ్యారు.

అయితే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన రోజే.. శాసనసభ కార్యాలయం ఈ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..