Telangana: వికారాబాద్ టీఆర్‌ఎస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయ్. జెడ్పీ ఛైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ మధ్య జరుగుతోన్న గొడవలు రోడ్డునపడ్డాయ్. వికారాబాద్ జెడ్పీ ఛైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి కారుపై వ్యతిరేక వర్గం ఎటాక్ చేయడంతో జిల్లాలో దుమారం రేపుతోంది. మర్పల్లి మండల కేంద్రంలో మహిళా భవనం శంకుస్థాపనకు వచ్చిన జెడ్పీ ఛైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డికి ఊహించని విధంగా చేదు అనుభవం ఎదురైంది. సునీతామహేందర్‌రెడ్డిని అడ్డుకున్న మర్పల్లి మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి వర్గీయులు, ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కారు ముందు ఆందోళనకు దిగిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ వర్గీయులు.. సునీతామహేందర్‌రెడ్డి కారు అద్దాలను ధ్వంసంచేశారు. మర్పల్లి గడ్డ-ఆనందన్న అడ్డా అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఇదిలాఉంటే.. దాడి తర్వాత ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై హాట్ కామెంట్స్ చేశారు జెడ్పీ ఛైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి. ఎమ్మెల్యే ఆనంద్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంప్లైంట్ చేస్తానన్నారు. శిలాఫలకాల్లో తన పేరు పక్కన చదివిన డిగ్రీలు లేవని వాటిని పగలగొట్టిన చరిత్ర ఎమ్మెల్యే ఆనంద్‌కు ఉందన్నారు సునీతామహేందర్‌రెడ్డి. జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడైన ఆనంద్, అందరినీ కలుపుకొని పోకుండా, చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారామె. ప్రతి చిన్న విషయాన్నీ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం ఎందుకని ఇన్నాళ్లూ ఊరుకున్నానని, ఇక అన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అంతేకాదు, ఆనంద్‌ను జిల్లా పార్టీ పదవి నుంచి తప్పిస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు వికారాబాద్ జెడ్పీ ఛైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి.