
హైదరబాద్ మియాపూర్‌కు చెందిన 40 ఏళ్ల ఐటీ ఉద్యోగి, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ యాడ్ ద్వారా ట్రేడింగ్ స్కామ్‌కు గురై ₹38.62 లక్షలు కోల్పోయాడు. వ్యాపారంలో ₹1.3 కోట్లు లాభాలుగా చూపించినా, అతని ఖాతాలో జమయిన మొత్తం కేవలం ₹200 మాత్రమే. ఈ కేసును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితుడు మొదట ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు. ఈ గ్రూప్‌లో “ప్రియా శర్మ”గా తాను పరిచయం చేసుకున్న యువతి అతనికి ట్రేడింగ్ గురించీ, అధిక లాభాలు పొందే పద్ధతుల గురించీ వివరించింది. ఆమె అతనికి “ASK ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ” అనే యాప్ ఉపయోగించమని సూచించింది. దీనివల్ల బ్లాక్ ట్రేడ్స్, అప్‌పర్ సర్క్యూట్ స్టాక్స్ వంటి విషయాల్లో మోహపూరితమైన వ్యూహాలతో అతన్ని పెట్టుబడి పెట్టించేందుకు ప్రోత్సహించింది.
వాట్సాప్ గ్రూప్‌లో వేరే సభ్యుల ద్వారా ఇచ్చిన టెస్ట్‌మోనియల్స్, స్క్రీన్‌షాట్‌లతో ఆకర్షితుడైన బాధితుడు తొలుత ₹50,000 పెట్టుబడి పెట్టి, తరువాత నెమ్మదిగా పెంచుతూ మొత్తం ₹14.87 లక్షలు పెట్టాడు. మొత్తంగా అతను తన ఖాతా మరియు భార్య ఖాతా ద్వారా ₹38.62 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు.
ట్రేడింగ్ జరుగుతున్న సమయంలో ప్రియా అతనికి ₹1 కోటి లాభాలు వచ్చాయని చెప్పింది. కానీ, ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు ముందు, ₹18 లక్షలు ట్యాక్స్ క్లీయరెన్స్ పేరుతో డిమాండ్ చేసింది. బాధితుడు ఈ మొత్తం తన లాభాల నుంచి తీసుకోమని అడిగినప్పుడు, ఆమె దానికి అంగీకరించకుండా.. ట్యాక్స్‌ను వేరుగా చెల్లించాల్సిందేనని చెప్పింది.
ఇంకొక సంఘటనలో, హైదరాబాద్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తిని ఇండియామార్ట్ అనే వాణిజ్య వెబ్‌సైట్‌లో ట్రాన్స్మిషన్ లైన్ టూల్స్ కోసం వెతుకుతున్న సమయంలో, మోసగాళ్లు ₹1,17,646కు మోసగించారు. US ఎంటర్‌ప్రైజెస్ అనే పేరుతో పర్సనల్ జాయింట్ అకౌంట్‌కు చెందినట్లుగా తమను పరిచయం చేసుకున్నారు. బాధితుడికి ఫోన్లో మాట్లాడి పర్చేజ్ ఆర్డర్ పంపించారు.
ఏప్రిల్ 5న ₹1,17,646 చెల్లింపును బాధితుడు చేశాడు. అయితే అప్పటి నుంచి అతనికి ఎటువంటి సరుకు రాలేదు. ఫాలో అప్‌లో, మోసగాళ్లు వాట్సాప్ ద్వారా మరిన్ని నకిలీ రసీదులు, షిప్పింగ్ డాక్యుమెంట్లు పంపించారు.
సిటీ సైబర్ క్రైమ్ ACP శివ మారుతి మాట్లాడుతూ, “బాధితుల ఫిర్యాదుల ఆధారంగా మోసగాళ్లను గుర్తించే పనిలో ఉన్నాం” అన్నారు. ఇలాంటి నేరు జరిగినప్పుడు వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..