AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Job Notification 2025: ఇస్రోలో జాబ్‌ చేయడం మీ డ్రీమా? రాత పరీక్షలేకుండా కొలువుకొట్టే ఛాన్స్‌ వచ్చేసిందోచ్..

ప్రతిష్టాత్మక ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) సంస్థలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యార్హతలతోపాటు ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారిని హైదరాబాద్‌తో తిరువనంతపురం, మహేంద్రగిరి, అహ్మదాబాద్, హసన్, వలియమల, శ్రీహరికోట కేంద్రాల్లో నియమిస్తారు..

ISRO Job Notification 2025: ఇస్రోలో జాబ్‌ చేయడం మీ డ్రీమా? రాత పరీక్షలేకుండా కొలువుకొట్టే ఛాన్స్‌ వచ్చేసిందోచ్..
ISRO Job Notification
Srilakshmi C
|

Updated on: May 01, 2025 | 3:20 PM

Share

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)లో పని చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే మీకో శుభవార్త.. తాజాగా ఇస్రో సైంటిస్ట్‌, ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారిని హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, మహేంద్రగిరి, అహ్మదాబాద్, హసన్, వలియమల, శ్రీహరికోట కేంద్రాల్లో నియమించే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 63 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 22 పోస్టులు, మెకానికల్‌ విభాగంలో 33 పోస్టులు, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 8 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్‌ డిగ్రీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే 2024 లేదా 2025 గేట్‌ స్కోరు కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 ఏళ్లు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు చెందినవారికి వయసులో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మే 149, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 2024/2025 గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతల ఆధారంగా 1:7 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 జీతంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, న్యూ పెన్షన్‌ స్కీమ్‌/ యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్, వ్యక్తిగత, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు, ఎల్‌టీఏ, గ్రూప్‌ ఇన్సూరెన్స్, హౌస్‌బిల్డింగ్‌ అడ్వాన్స్‌ వంటి ఇతర సదుపాయాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే..?

ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఇందులో అకడమిక్‌ నాలెడ్జ్‌కు 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌కు 20 మార్కులు, ప్రజెంటేషన్‌, కమ్యూనికేషన్‌ స్కిల్‌కు 20 మార్కులు, కాంప్రహెన్షన్‌కు 10 మార్కులు, అకడమిక్‌ అచీవ్‌మెంట్స్‌కు 10 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూలో 60 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఇంటర్వ్యూకు 50 శాతం, గేట్‌ స్కోరుకు 50 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇతక వివరాలకు ఇస్రో వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్