AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

చిన్నపాటి వాగ్వాదం.. క్షణికావేశం.. వెరసి ఒక నిండు ప్రాణం బలైపోయింది. హైదరాబాద్‌లోని టోలిచౌకిలో అర్ధరాత్రి వేళ ఓ జ్యూస్ సెంటర్‌లో పనిచేసే ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ హత్యకు దారితీసింది. సర్వింగ్ బాయ్‌గా పనిచేస్తున్న 17 ఏళ్ల బాలుడిని తన తోటి కార్మికుడే గరిటతో తలపై కొట్టి చంపడం నగరంలో సంచలనంగా మారింది.

Hyderabad: జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Minor Boy Killed With Serving Spoon
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Apr 08, 2026 | 1:52 PM

Share

హైదరాబాద్‌లో మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో జరిగిన చిన్న గొడవ ఎంత పెద్ద విషాదానికి దారితీసింది. ఫలితంగా ఒక మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. జ్యూస్ పాయింట్‌లో పని చేస్తున్న ఇద్దరు యువకుల మధ్య మొదలైన వివాదం మాటామాటా పెరిగి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. టోలిచౌకిలో ఉన్న నైస్ జ్యూస్ పాయింట్‌లో అలం (17) అనే మైనర్ బాలుడు సర్వింగ్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో అలంకు, అక్కడ పనిచేస్తున్న మరో సహచరుడికి మధ్య చిన్న విషయంలో మాటామాటా పెరిగింది. ఈ వాగ్వాదం కాస్తా తీవ్ర వివాదంగా మారింది.

గరిటతో తలపై దాడి.. అక్కడికక్కడే మృతి

వివాదం ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు, దుకాణంలో జ్యూస్ కోసం ఉపయోగించే ఇనుప గరిటతో అలం తలపై బలంగా బాదాడు. దెబ్బ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అలం రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు, చుట్టుపక్కల వారు స్పందించే లోపే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల రంగప్రవేశం

సమాచారం అందుకున్న వెంటనే మెహదీపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చిన్నపాటి ఘర్షణే ఈ దారుణానికి దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో టోలిచౌకి ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.

Follow Us
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే
పిల్లల భవిష్యత్తు మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందని తెలుసా
పిల్లల భవిష్యత్తు మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందని తెలుసా
కాసుల కోసం కంత్రీ స్కెచ్ వేశారు.. కానీ భలే చిక్కారు..
కాసుల కోసం కంత్రీ స్కెచ్ వేశారు.. కానీ భలే చిక్కారు..