Telangana: గెస్ట్ లెక్చలర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. పారితోషికాన్నిపెంచుతూ ఉత్తర్వులు..

తెలంగాణలోని జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్ల పారితోషికాన్ని పెంచుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో పీరియడ్‌కు రూ. 300 చొప్పున పారితోషికాన్ని ఇస్తుండగా.. తాజాగా పీరియడ్‌కు రూ. 390కి పెంచూతూ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్.

Telangana: గెస్ట్ లెక్చలర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. పారితోషికాన్నిపెంచుతూ ఉత్తర్వులు..
Guest Lecturers

Updated on: Jun 10, 2022 | 12:07 PM

గెస్ట్ లెక్చలర్లకు తెలంగాణ సర్కార్(Telangana) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా తమ పారితోషికాన్ని పెంచాలని ఆందోళన వ్యక్తం చేస్తున్న గెస్ట్ లెక్చలర్ల డిమాండ్‌ను ఓకే చేసింది తెలంగాణ ప్రభుత్వం. వారి కోరికను మన్నించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గెస్ట్ లెక్చలర్ల పారితోషకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ జీవో – 1105ని విడుదల చేశారు. దీంతో 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న రెండు వేల మంది గెస్ట్‌ లెక్చరర్లకు ప్రయోజనకం కలగనుంది. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చలర్ల పారితోషికాన్ని పీరియడ్ కు రూ. 300 నుంచి రూ. 390కి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు నెలకు 72 గంటల పాటు పనిచేసేలా..  పారితోషికం రూ. 28,080 మించరాదని సీలింగ్ విధించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 405 జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెండు వేల మంది లెక్చలర్లకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల లెక్చలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సర్కార్ ఖజాానాపై కొంత ఆర్థిక భారం పడనుంది. అయితే ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎంత వరకు పెరుగనుందంటే..

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గెస్ట్ లెక్చర్లకు ఇస్తున్న వేతనం కాస్తా పెరుగనుంది. వీరికి గతంలో పీరియడ్‌కు రూ. 150 మాత్రమే ఇస్తుండగా.. 2017లో పీరియడ్‌కు రూ. 300కు వరకు పెంచింది. తాజా పీఆర్సీ ప్రకారం.. రూ. 390కి పెంచింది. వీరికి గతంలో పీరియడ్‌కు రూ. 150 చొప్పున నెలకు రూ. 10, 800 మాత్రమే ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం సుమారు రెండు రెట్లు పెంచింది. పీరియడ్‌కు రూ. 300 ఉన్నప్పుడు నెలకు రూ. 21,600 అందగా, తాజా పెంపుతో రూ. 28,080కి చేరింది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం..