గజ్వేల్ సిగలో మరో కలికితురాయి.. సంగాపూర్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు
గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. గజ్వేల్ మండలం సంగాపుర్ లో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను మంత్రులు..
గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. గజ్వేల్ మండలం సంగాపుర్ లో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను మంత్రులు ప్రారంభించారు. గజ్వేల్, వర్గల్ ప్రధాన రహదారిని అనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో 117 హెక్టార్లలో రూ. 7.43 కోట్ల వ్యయంతో అర్బన్ ఫారెస్ట్ పార్కును తీర్చిదిద్దారు
పార్కు లోపల ‘సేవ్ ఫారెస్ట్..సేవ్ ఎర్త్’ పేరిట ఏర్పాటు చేసిన భారీ గ్లోబ్, వాచ్ టవర్, ఓపెన్ జిమ్, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం, గజీబో, రాశివనం, ఒపెన్ డైనింగ్, ఇతర సౌకర్యాలతో పార్కును అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, పీసీసీఎఫ్ ఆర్. శోభ, ఎఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధ శర్మ, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, సీఎఫ్ శర్వనంద్, డీఎఫ్ వో శ్రీధర్ రావు, ఇతర ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.
Read more:
ఆ పిటిషన్‌దారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించిన ధర్మాసనం