ఆ పిటిషన్‌దారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించిన ధర్మాసనం
తెలంగాణ హైకోర్టులో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఒక్కొక్కరికి జరిమానా..
తెలంగాణ హైకోర్టులో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఒక్కొక్కరికి జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. డిగ్రీ, జూనియర్ కాలేజీల కాంట్రాక్టు లెక్షరర్లను క్రమబద్ధీకరించకుండా ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని 2016లో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది.
ప్రభుత్వం కాంట్రాక్టు లెక్షరర్ల సర్వీసు క్రమబద్ధీకరించిందా అని ఈ సందర్భంగా పిటీషనర్లను న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు రూపొందించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో పిటిషన్ దాఖలు చేసిన 24 మంది నిరుద్యోగులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రమబద్ధీకరిస్తున్నారని ఊహించుకొని పిటిషన్ ఎలా వేస్తారని అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం. పిటిషనర్లు ఒక్కొక్కరు రూ.10 వేలు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ చర్యతో అవాక్కవడం పిటిషన్‌దారులు వంతైంది.
మరిన్ని ఇక్కడ చదవండి :