Srinivas Goud: హత్యకు కుట్రపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయంటూ..

Minister Srinivas Goud murder case: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు కలకలం రేపింది.

Srinivas Goud: హత్యకు కుట్రపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయంటూ..
Srinivas Goud

Updated on: Mar 07, 2022 | 6:34 PM

Minister Srinivas Goud murder case: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు జరిగిన కుట్రలో భాగంగా రూ.15 కోట్ల డీల్‌ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసి రెండు గన్నులను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత తొలిసారి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం దీనిపై మాట్లాడనంటూ శ్రీనివాస్ స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందంటూ పేర్కొన్నారు. పలు కీలక కేసులను ఛేదించి పరిష్కరించిన ఘనత తెలంగాణ పోలీసులదన్నారు. త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే.. ఈ కేసుపై సోమవారం విచారించిన మేడ్చల్ కోర్టు 8 మంది నిందితులకు 4 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. అయితే.. 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. దీనిపై స్పందించిన కోర్టు నాలుగు రోజులకే అనుమతిచ్చింది. కాగా.. నిందితులను న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతోపాటు వీడియో రికార్డు కూడా చేయాలని మేడ్చల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‎ గౌడ్‎ హత్యకు కుట్ర కేసు.. మరో నాలుగు రోజుల కస్టడీకి నిందితులు

Telangana Budget 2022: ఆ ముగ్గురినీ అందుకే సస్పెండ్ చేశాం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి హరీష్ రావు..