Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‎ గౌడ్‎ హత్యకు కుట్ర కేసు.. మరో నాలుగు రోజుల కస్టడీకి నిందితులు

|

Mar 07, 2022 | 4:24 PM

Minister Srinivas Goud murder case: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసుపై పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించారు.

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‎ గౌడ్‎ హత్యకు కుట్ర కేసు.. మరో నాలుగు రోజుల కస్టడీకి నిందితులు
Telangana Minister Srinivas Goud
Follow us on

Minister Srinivas Goud murder case: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసుపై పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలో సోమవారం 8 మంది నిందితులకు 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. దీనిపై స్పందించిన కోర్టు నాలుగు రోజులకే అనుమతిచ్చింది. కాగా.. నిందితులను న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతోపాటు వీడియో రికార్డు కూడా చేయాలని మేడ్చల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. హత్యకు కుట్రపై మరికొన్ని కీలక సమాచారాన్ని రాబట్టేందుకు విచారణను వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు అలర్ట్ అయ్యేలా చేసింది. దీంతో పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. సీఎం తర్వాత మంత్రికి గ్రే హౌండ్స్‌తో భద్రత కల్పించనున్నారు. ఇక నుంచి మంత్రిని కలిసేందుకు వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించే అనుమతించనున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు 20 మంది పోలీసులు, 10 మంది సిటీ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది, ఆరుగురు ఇంటెలిజెన్స్ అధికారులు, నలుగురు గ్రేహౌండ్స్ కమాండోలతో అత్యాధునిక ఎం44 వెపన్స్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రత‌ కల్పించనున్నారు. దీంతోపాటు మంత్రి కాన్వాయ్‌లోకి మరో రెండు వాహనాలు అదనంగా వచ్చి చేరనున్నాయి.

Also Read:

Ramagundam: సింగరేణిలో ఘోర ప్రమాదం.. గని పైకప్పు కూలి నలుగురు దుర్మరణం..

Microsoft Data Centre: హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి.. మైక్రోసాఫ్ట్‌తో డీల్‌ కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం