విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) జూలై 2వ తేదీ హైదరాబాద్‌కు రానున్నారు. యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) పర్యటన వివరాలను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌కు వస్తున్న యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం పలుకుతారని తెలిపారు. బేగంపేట, సోమాజిగూడా, రాజ్ భవన్ రోడ్ మీదుగా నెక్లెస్ రోడ్‌లోని జలావిహార్‌కు చేరుకుంటారు. అక్కడ సీఎం అధ్యక్షతన సమావేశం ఉంటుందన్నారు. అనంతరం అక్కడే యశ్వంత్ సిన్హా, సీఎం కేసీఆర్ కలిసి లంచ్ చేస్తారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవని.. నిన్న మహారాష్ట్ర, మొన్న కర్ణాటక, గోవాలో ఏమైందో ప్రజలు గమనిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
బీజేపీ టూరిస్టులు హైదరాబాద్ అందాలతో పాటు అభివృద్ధిని చూడాలని ఆ పార్టీ నేతలనుద్దేశించి ఎద్దేవ చేశారు. దేశ రాజకీయాల్లో టీఆరెస్ కీలక పాత్ర పోషించనుందని తలసాని పేర్కొన్నారు. గతంలో రామ్‌నాథ్ కొవింద్‌కు ఘనంగా స్వాగతం పలికాం… ఆనాడు, ఈనాడు మాలో ఏ మార్పు లేదన్నారు. పెరేడ్ గ్రౌండ్‌లో మేం మీటింగ్ పెట్టుకుంటాం అంటే ఆర్మీ స్థలం.. అనుమతి ఇవ్వమన్నారు.
ఆనాడు ఆర్మీ అడ్డు వచ్చింది. ఇవాళ ఏ అడ్డంకులు లేవా? అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులకు నిజాలు తెలియజేయడం కోసమే టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను కనపరుస్తూ ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టామన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.