Talasani: గోల్కొండ బోనాలకు వచ్చినంత జనం లేరు.. బీజేపీ బహిరంగ సభపై మంత్రి తలసాని సెటైర్లు..

తలదించుకునే పరిస్థితి ఉందని ఆరోపించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. హైదరాబాద్‌ డైనమిక్ అని సర్టిఫికెట్ ఇస్తూనే అభివృద్ధి జరగలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో..

Talasani: గోల్కొండ బోనాలకు వచ్చినంత జనం లేరు.. బీజేపీ  బహిరంగ సభపై మంత్రి తలసాని సెటైర్లు..
Talasani Srinivas Yadav

Edited By:

Updated on: Jul 04, 2022 | 3:16 PM

మోదీ పాలనతో ప్రపంచ దేశాల ముందు తలదించుకునే పరిస్థితి ఉందని ఆరోపించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. హైదరాబాద్‌ డైనమిక్ అని సర్టిఫికెట్ ఇస్తూనే అభివృద్ధి జరగలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం చప్పగా సాగిందని విమర్శించారు. బీజేపీ సభపై సెటైర్లు సంధించారు. గోల్కొండ బోనాలకు వచ్చినంత జనం కూడా బీజేపీ బహిరంగ సభకు రాలేదని ఎద్దేవ చేశారు. ధాన్య కొనుగోలు చేశామని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవ చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌ అందాలు చూసి వెళ్లారని విమర్శించారు. తెలంగాణ కు ఏదైనా ఇచ్చి వెళితే మాతో తలపడే సత్తా ఉండేదని అన్నారు.

సీఎం అడిగిన తొమ్మిది ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పలేదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగడం లేదని.. అనవసరంగా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలన్నారు. సభలో నీళ్లు, నియామకాల గురించి అమిత్‌షా మాట్లాడారని.. రెండు రోజులు బీజేపీ నేతలు తాగిన నీళ్లు తెలంగాణవి కాదా? అని తలసాని ప్రశ్నించారు.

ఇక మోదీ ప్రసంగమంతా ద్వేషంతో సాగిందన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి. తెలంగాణకు ఏం చేశారో చెప్పెందుకు కూడా ప్రధాని తడబడ్డారని విమర్శించారు.

తెలంగాణ వార్తల కోసం