Telangana Job Calender: తెలంగాణ నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల ఎప్పుడంటే..? ప్రభుత్వం ప్రకటన

Telangana News: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌పై తెలంగాణ ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసేందుకు రంగం సిద్దమవుతోంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Telangana Job Calender: తెలంగాణ నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల ఎప్పుడంటే..? ప్రభుత్వం ప్రకటన
telangana Unemployes

Updated on: Jan 10, 2026 | 7:11 AM

Job Calender 2026: తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని పొందుపర్చింది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెబుతోంది. అందుకు అనుగుణంగా 2026 జాబ్ క్యాలెండర్ విడుదలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ జాబ్ క్యాలెండర్‌లో ఈ ఏడాది ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాం..? ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తాం..? పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తాం? అనే వివరాలు స్పష్టంగా పొందుపర్చనుంది. దీని వల్ల నిరుద్యోగుల ఆందోళన తొలగిపోవడంతో పాటు రిక్రూమెంట్లలో పారదర్శకత ఉంటుంది.

త్వరలోనే జాబ్ క్యాలెండర్

నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది ముందే తెలియడం వల్ల నిరుద్యోగులు ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. 2026 జాబ్ క్యాలెండర్ త్వరలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ రూపొందిస్తుందని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమం శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్‌పై స్పష్టతిచ్చారు. ఇటీవల ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్న క్రమంలో శ్రీధర్ బాబు ప్రకటన చేయడం గమనార్హం.

అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల

జాబ్ క్యాలెండర్ కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టగా.. కొత్త ఏడాది వచ్చినా జాబ్ క్యాలెండర్ ఇంకా విడుదల చేయడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటిపై స్పందించిన శ్రీధర్ బాబు.. ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది..? పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తాం..? ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తాం? అనే సమగ్ర వివరాలతో త్వరలోనే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని స్పష్టతిచ్చారు. ప్రతీ ఏడాది ఇలాగే విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఏర్పడిన ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని, నిరుద్యోగులు సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక జాబ్ క్యాలెండర్‌ను మాత్రమే పాటించాలని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రూప్ నోటిఫికేషన్ల ద్వారా 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరికొన్ని పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. అవి వివిధ దశల్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.