ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 44 ఏళ్లు.. తొలిసారి అధికారికంగా అమరవీరుల సంస్మరణ దినం!

ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలు నేటితో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 44 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఇంద్రవెళ్లి స్వేచ్చ వాయువులను పీల్చుకుంటోంది. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినాన్ని ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఆంక్షల నడుమ ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై 44 ఏళ్లుగా ఉన్న నిషేధం, నిర్భందాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది.

ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 44 ఏళ్లు.. తొలిసారి అధికారికంగా అమరవీరుల సంస్మరణ దినం!
Indravelli Martyrs

Edited By:

Updated on: Apr 20, 2025 | 11:09 AM

Indravelli Martyrs Day: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలు నేటితో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 44 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఇంద్రవెళ్లి స్వేచ్చ వాయువులను పీల్చుకుంటోంది. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినాన్ని ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఆంక్షల నడుమ ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై 44 ఏళ్లుగా ఉన్న నిషేధం, నిర్భందాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించడంతో ఆంక్షలను సడలించినా.. అధికారిక నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. ఆదివాసీ అమరులకు సరైన‌ గౌరవం దక్కాలని.. స్వేచ్చాయిత వాతవరణంలో అధికారికంగా అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరపాలన్న ఆదివాసీ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ ఇంద్రవెళ్లి అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఈ నిర్ణయంతో గిరిజనులు అమరవీరులకు స్వేచ్ఛగా నివాళులర్పించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ లోని అమరవీరుల స్థూపం వద్ద జరగనున్న అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ఇంఛార్జ్ మంత్రి సీతక్క పాల్గొననున్నారు.

1981, ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది ఆనాటి గిరిజనం. భూమి కోసం భుక్తి కోసం నియంతృత్వ ప్రభుత్వం నుండి విముక్తి కోసం పోరాటానికి తుడుం మోగించింది. జల్ జంగిల్ జమీన్ అంటూ నినదిస్తూ రగల్ జెండా ఊపింది. ఈ పోరాటానికి అనుమతి లేదంటూ ఆ నాటి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసింది. అవేమి లెక్క చేయకుండా తుపాకీ తూటాలను‌ సైతం ఎదుర్కొనేందుకు మావనాటే మావ సర్కార్ అంటూ నినదిస్తూ పోరు సలిపింది ఆ నాటి ఆదివాసీ జనం. ఈ పోరాటంలో 13 మంది ఆదివాసీలు మరణించారని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 100 కు పైగా ఉంటుందని ఆదివాసీలు చెబుతుంటారు. ఆ కాల్పుల్లో అమరులైన ఆదివాసీల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతీ ఏటా ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లి మండలం హిరాపూర్‌లో ఆదివాసీలు సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు.

ఆనాడు మరణించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతీ ఈఏడాది ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లి మండలం హిరాపూర్‌లో ఆదివాసీలు సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమంపై నిషేధం ఉండేది. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం సంస్మరణ కార్యక్రమంపై ఉన్న ఆంక్షలను సడలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిషేధాన్ని పూర్తిగా ఎత్తేసింది. దాంతో ఆదివాసీలు ఈరోజు అధికారికంగా అమరవీరుల సంస్మరణ దినం చేస్తున్నారు. ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన కుటుంబాలను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆ హామీని నిలబెట్టుకుంటోంది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ట్రైకార్‌ రుణాలు అందిస్తోంది. ఇందుకు గాను రూ.1.50కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితో పాటు బాధిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది. ఆదివారం జరిగే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క ఆయా పత్రాలను లబ్ధిదారులకు అందజేయనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….