AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్‌లో 'తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం' ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నిజాం నియంతృత్వ పాలన పై జరిగిన పోరాట..

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
Pardhasaradhi Peri
|

Updated on: Sep 13, 2020 | 3:57 PM

Share

హైదరాబాద్‌లో ‘తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం’ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నిజాం నియంతృత్వ పాలన పై జరిగిన పోరాట చరిత్ర తెలిసిన వారిగా, స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంకా కిషన్ రెడ్డి తన లేఖలో ఏం రాశారంటే.. ‘భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ విమోచన పోరాటం దేశ చరిత్రలోనే ప్రత్యేకమైనది. 1947 ఆగస్ట్ 15న దేశమంతా స్వేచ్ఛావాయువులు పీల్చినప్పటికీ నాటి నిజాం పాలనలో హైద్రాబాదు సంస్థానం.

ప్రస్తుత తెలంగాణలో మాత్రం నాడు మువ్వన్నెల జెండా ఎగరలేదని మీకు తెలుసు. తెలంగాణ ప్రజలను అనేక కష్టనష్టాలకు గురిచేసిన నిజాంను గద్దె దింపి, హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కల్పించటంలో ఎంతో మంది మహానాయకుల పాత్ర ఉంది. దీనితోపాటు, వేలాది మంది ప్రజలు పోషించిన ఉద్యమ పోరాట నాయకులు పాత్ర చిరస్మరణీయం. ఇంతటి విశిష్ట, సాహసోపేత చరిత్ర ఉన్న ‘తెలంగాణ విమోచన పోరాటం’ గురించి ప్రస్తుత, భావితరాలు తెలుసుకుని స్ఫూర్తి పొందాల్సిన అవసరముంది. దీనికి అనుగుణంగానే.. ఇటీవల నేను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గారిని కలిసి ఈ అంశం గురించి ప్రస్తావించినపుడు, తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు వారు సానుకూలంగా స్పందించి, కేంద్ర ప్రభుత్వం నుండి స్పూర్తి కేంద్రం నిర్మాణానికి కావలసిన నిధులు అందిస్తామని చెప్పారు. ఈ మ్యూజియం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన భూమిని కేటాయించాల్సిందిగా మనవి చేస్తున్నాను. హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన అమరవీరుల ఉద్యమ స్పూర్తి కేంద్రానికి భూమి కేటాయిస్తే, ఒక అద్భుతమైన, ప్రేరణాత్మకమైన ‘తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం’ భావితరాలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంది’. అని కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కోరారు.