Minister KTR: రాష్ట్రంపై వివక్షతో దేశ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న మోడీ ప్రభుత్వం.. కేటీఆర్ ఆగ్రహం..

|

Sep 02, 2022 | 5:37 PM

కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు కేటీఆర్ లేఖ రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు మోడీ సర్కార్ మొండి చేయి చూపిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Minister KTR: రాష్ట్రంపై వివక్షతో దేశ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న మోడీ ప్రభుత్వం.. కేటీఆర్ ఆగ్రహం..
Follow us on

Minister KTR on Modi Govt: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై.. తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంపై వివక్షతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టుపెడుతోందంటూ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు కేటీఆర్ లేఖ రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు మోడీ సర్కార్ మొండి చేయి చూపిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని కేటీఆర్ పేర్కొన్నారు. భూసేకరణ, పర్యావరణ అనుమతులతో ఫార్మాసిటీ సిద్ధంగా ఉందన్నారు. అయితే, మాస్టర్‌ ప్లానింగ్‌తో ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని కేంద్రం ఎందుకు విస్మరించిందో అర్థం కావడం లేదంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలంటే కనీసంగా మూడేళ్లు పడుతుందని కేటీఆర్ వివరించారు. అన్ని సిద్దంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని పరిగణలోకి తీసుకుపోకపోవడం, ఫార్మా రంగాన్ని అత్మనిర్భరత దిశగా స్వయం సమృద్ధి చేయాలన్న లక్ష్యం పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతలేమికి ఇది నిదర్శనం అంటూ ఎద్దెవా చేశారు. అన్ని అనుకూలతలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీకి మొండి చేయి ముమ్మాటికీ వివక్షేనంటూ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి వెంటనే తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..