Minister KTR: బీజేపీపైనే అనుమానం.. రాజకీయాల కోసం పిల్లల్ని చెడగొట్టొద్దు.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

|

Mar 18, 2023 | 2:43 PM

ఇద్దరు వ్యక్తుల వల్ల సంస్థకే చెడ్డ పేరు వొచ్చింది.. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డినే కాకుండా.. వీరి వెనకాల ఎవరు ఉన్న వొదిలిపెట్టం.. ఇది సిస్టమ్ తప్పు కాదు వ్యక్తుల తప్పు.. పిల్లల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Minister KTR: బీజేపీపైనే అనుమానం.. రాజకీయాల కోసం పిల్లల్ని చెడగొట్టొద్దు.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Minister KTR
Follow us on

ఇద్దరు వ్యక్తుల వల్ల సంస్థకే చెడ్డ పేరు వొచ్చింది.. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డినే కాకుండా.. వీరి వెనకాల ఎవరు ఉన్న వొదిలిపెట్టం.. ఇది సిస్టమ్ తప్పు కాదు వ్యక్తుల తప్పు.. పిల్లల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ ఘటనపై ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక 150నోటిఫికేషన్ ఇచ్చామని.. టీఎస్‌పీఎస్‌సీ ఏకకాలంలో 10లక్షల మందికి పరీక్ష నిర్వహించిందని తెలిపారు. సాంకేతికంగా అనేక నిర్ణయాత్మక మార్పులు TSPSCలో జరిగాయన్నారు. UPSC ఛైర్మెన్ రెండు సార్లు ఇక్కడికి వొచ్చి TSPSC ని విజిట్ చేసారని.. దేశం మొత్తంలో అత్యధికంగా ఉద్యోగాల కల్పన చేసిన సంస్థ tspsc మాత్రమేనేన వెల్లడించారు. ఇంత వరకు ఎలాంటి ఆరోపణలు లేవని.. మళ్ళీ తప్పు జరగకుండా చూసుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఎలాంటి మార్పులు చేయాలో వాటి గురించి చర్చించామని తెలిపారు. పేపర్ లీకేజీతో పరీక్షలు రద్దు అయినాయని.. గతంలో అప్లై చేసుకున్నవారు మళ్ళీ ఫీజ్ కట్టనవసరం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కోచింగ్ మెటీరియల్ మొత్తమ్ ఆన్లైన్‌లో ఉంచుతామని స్పష్టంచేశారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ బీజేపీలో క్రియశిల కార్యకర్త అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే కుట్ర ఏమైనా ఉందా అని అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. నోటిఫికేషన్లను బండి సంజయ్ తప్పు పట్టారు.. అందులో భాగమే ఈ పేపర్ లీక్ లాగా కనిపిస్తుందని తెలిపారు. డీజీపీ దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నామన్నారు. ఎం జరుగుతుందో ప్రజలు గమనించాలని.. రాజకీయాల కోసం పిల్లల్ని చెడగొట్టొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఐటీ మినిష్టర్ రాజీనామా చేయాలంటున్నారు.. అసలు నాకేం సంబంధం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఐటి మంత్రి విధుల గురించి కూడా తెలియదా?.. పిల్లల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పేపర్ లీకేజీ ఘటన దురదృష్టకరమని.. దీనిపై సీఎంతో సమగ్రంగా చర్చించామని కేటీఆర్ పేర్కొన్నారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగాల దరఖాస్తును ఈజీ చేసామన్నారు. 99 కంప్యూటర్ బేస్ పరీక్షలు నిర్వహించామని.. 7 భాషల్లో ఓకేసారి పరీక్ష నిర్వహించిన ఘనత టీఏస్పీఏస్సీది.. అతని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియామక బోర్డుపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.. పక్షపాత ధోరణి వల్ల నష్టపోవద్దని ఇంటర్వ్యూ సిస్టంను రద్దు చేసామని వివరించారు. యువతకు భరోసా ఇవ్వాల్సిన భాధ్యత తమపై ఉంది కాబట్టే.. ఇంత మంది మంత్రులం వచ్చి మాట్లాడుతున్నామన్నారు. ప్రవీణ్, రాజశేఖర్ మాత్రమే కాదు.. వారి వెనక ఎవరు ఉన్న కఠినంగా శిక్ష పడేలా చేస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత పడుతాం..కొత్త సంస్కరణలు తీసుకొస్తాం.. రద్దైన నాలుగు పరీక్షలకు అప్లై చేసుకున్న వారందరూ మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. వీలైనంత త్వరగా రద్దైన పరీక్షలు నిర్వహిస్తాం.. నాలుగు పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ఆన్లైన్లో అందుబాటులో పెడతామన్నారు. స్టడీ సర్కిల్ లను బలోపేతం చేస్తామని.. రీడింగ్ రూమ్స్ 24 గంటలు తెరచే ఉంటాయి.. అక్కడే భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. యువతను రెచ్చగొట్టే విధంగా, ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చే విధంగా కొందరు మాట్లాడుతున్నారు.. రాజకీయ నిరుద్యోగులు చేసే వాఖ్యలను యువత పట్టించుకోవద్దు..బీఆర్ఎస్ పార్టీ తరుపున డీజీపీకి ఫిర్యాదు చేసామని.. రాజశేఖర్ రెడ్డి బీజేపీ క్రియాశీలక కార్యకర్త.. కావున దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నాని తెలిపారు. బీజేపీపై తమకు అనుమానం ఉందని.. నోటిఫికేషన్లపై కుట్ర చేసారనే అనుమానం ఉందని తెలిపారు.

ఎన్నికలు కొద్దీ రోజుల్లోనే ఉన్నాయి.. ప్రజలకు ఎవరు ఏంటో తెలుసంటూ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో 16 లక్షల ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు.. పబ్లిక్ సర్వీస్ కమీషన్లో ప్రభుత్వం పాత్ర ఉండదు.. కాన్సిట్యూషన్ బాడీ.. అంటూ తెలిపారు. గుజరాత్,అస్సాంలో పేపర్ లీకైయింది..అక్కడి మంత్రి రాజీనామా చేసాడా.. పరీక్షలో క్వాలిఫై అయిన పిల్లలు పెద్ద మనసుతో అర్దం చేసుకోవాలి. సిట్ విచారణ పూర్తి కాలేదు.. అనుమానం ఏమున్నాయో చెప్పండి నివృత్తి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..